Begin typing your search above and press return to search.

యాత్ర దర్శకుడికి భలే ఛాన్స్

By:  Tupaki Desk   |   28 Feb 2019 4:34 AM GMT
యాత్ర దర్శకుడికి భలే ఛాన్స్
X
స్వర్గీయ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానంలో కీలక మలుపుగా నిలిచిన పాదయాత్రను నేపధ్యంగా తీసుకుని దర్శకుడు మహి రాఘవ తీసిన యాత్ర రికార్డులు సృష్టించలేదు కాని వచ్చిన పాజిటివ్ టాక్ తో బయ్యర్లను నష్టపోకుండా కాపాడగలిగింది. ఏ ఉద్దేశంతో కథను చెప్పాలనుకున్నారో అది నెరవేరడంతో ప్రేక్షకులు ఇందులో ఎమోషన్ కు బాగానే కనెక్ట్ అయ్యారు. మమ్ముట్టికి ఉన్న మార్కెట్ పరిమితులు ఇది ఒక పార్టీ నాయకుడి సినిమా అనే ప్రచారం కొంత ప్రభావం చూపించాయి కాని లేకపోతే వసూళ్లు ఇంకా బాగా వచ్చేవి.

ఏదైతేనేం ఫైనల్ గా మహి రాఘవ సక్సెస్ అయిన మాట నిజం. ప్రస్తుతానికి ఆఫర్లు బాగానే వస్తున్నప్పటికీ కొత్త సినిమా విషయంలో తొందరపడకూడదని డిసైడ్ అయిన మహి రాఘవకు ఇటీవలే దుల్కర్ సల్మాన్ నుంచి కాల్ వచ్చిందట. రిలీజైనప్పుడు చూడలేకపోయినా ఇటీవలే మలయాళం వెర్షన్ యాత్రను దుల్కర్ చూసాడు. అద్బుతమైన ఎమోషన్ తో తన తండ్రిని వైఎస్ ఆర్ పాత్రలో చూపించిన తీరుకు ఫిదా అయిపోయి ప్రత్యేకంగా అభినందించడం కోసమే మహి రాఘవను కొచికి పిలిపించి మరీ చెప్పాడట. అంతే కాదు మంచి సబ్జెక్టు ఉంటే కలిసి చేద్దామని మాట కూడా ఇవ్వడం విశేషం.

దుల్కర్ సల్మాన్ కు ఇప్పుడు అన్ని ప్రధాన బాషలలో మంచి ఇమేజ్ ఉంది. తెలుగులో చేసిన స్ట్రెయిట్ మూవీ మహానటి ఒకటే అయినప్పటికీ కావలసినంత గుర్తింపు వచ్చేసింది. హిందిలో కార్వాన్ తో డీసెంట్ హిట్ ఆల్రెడీ కొట్టేసాడు. తమిళ్ లో ఓకే కన్మణి నుంచే దుల్కర్ కు ఫాలోయింగ్ ఉంది. ఇక మలయాళం సంగతి సరేసరి. నెక్స్ట్ సూపర్ స్టార్ తనేనంటూ ఇప్పటికే మీడియా ఫిక్స్ అయిపోయింది. సో మహి రాఘవ కనక ఈ ఛాన్స్ వాడుకుంటే ఎక్కడికో వెళ్ళిపోవడం ఖాయం