Begin typing your search above and press return to search.

వైయ‌స్సార్ క‌థ పాత బ‌డిపోలేదు!- మ‌హి.వి.రాఘ‌వ్‌

By:  Tupaki Desk   |   31 Jan 2019 10:30 AM GMT
వైయ‌స్సార్ క‌థ పాత బ‌డిపోలేదు!- మ‌హి.వి.రాఘ‌వ్‌
X
వైయ‌స్సార్ జీవిత‌ క‌థలోని పాద‌యాత్ర ఘ‌ట్టాన్ని `యాత్ర‌` పేరుతో తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. మ‌మ్ముట్టి క‌థానాయ‌కుడిగా న‌టించ‌గా - మ‌హి.వి.రాఘ‌వ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఫిబ్ర‌వ‌రి 8న ఈ చిత్రాన్ని తెలుగు - త‌మిళం - మ‌ల‌యాళంలో రిలీజ్ చేస్తున్నామ‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే మ‌మ్ముట్టి డ‌బ్బింగ్ స‌హా అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయ‌ని యాత్ర గురించి మ‌హి.వి.రాఘ‌వ్ హైద‌రాబాద్ చిట్ చాట్‌ లో వెల్ల‌డించారు.

మ‌హి.వి.రాఘ‌వ్ మాట్లాడుతూ.. యాత్ర చిత్రాన్ని అంద‌రూ ఓ రాజ‌కీయ నేప‌థ్య చిత్రం అనుకున్నారు. ఇది ఒక రాజ‌కీయ నాయ‌కుడి సినిమానే. రాజ‌కీయాలు 20-30 శాత‌మే ఉంటాయి. రాజ‌కీయాల కంటే ఒక క‌థ‌గా.. ఒక మ‌నిషి క‌థ‌గా చూపిస్తున్నాం. రాజ‌శేఖ‌రుని జీవితంలో పాద‌యాత్ర అనే ఒక ఈవెంట్ ని మాత్రమే తీస్తున్నాం. ఆ మొత్తం చ‌రిత్రలో ఈ భాగం మాత్ర‌మే తెర‌పై చూపిస్తున్నాం. అలాగ‌ని ఓన్లీ పాద యాత్రే కాదు.. చాలా లేయ‌ర్స్ లో సినిమాని చూపిస్తాం. ఇది అస్స‌లు డాక్కుమెంట‌రీగా ఉండ‌దు. ఒక‌ రియ‌ల్ పాత్ర‌.. రియ‌ల్ స్ఫూర్తిని తెర‌పై చూపిస్తున్నాం. దీనికి ఇత‌ర‌ పాత్ర‌ల్ని క‌లిపి తీశాం. ఒక క‌థ‌గా.. ఒక పాత్ర గా న‌చ్చి ఈ సినిమా చేశారు మ‌మ్ముట్టి.. అందుకే మ‌ల‌యాళంలోనూ రిలీజ్ చేస్తున్నాం`` అని తెలిపారు. ఇందులో పాజిటివ్ విష‌యాల్ని మాత్ర‌మే చూపించాం. జ‌గన్ గారికి ట్రైల‌ర్ చూపించాం. అప్పుడు మీ నాయ‌కుడి క‌థ‌ను మీరు చేశారు అని వైవిధ్యంగా స్పందించారు. అదే మాకు ధైర్యాన్ని నింపింది. ఒక‌ జీవిత‌క‌థ చెప్పేట‌ప్పుడు ఆ ఫ్యామిలీ ఆస‌క్తి వ‌ల్ల కుటుంబ స‌భ్యులు ముందే సినిమా చూస్తామ‌ని అంటారు. కానీ జ‌గ‌న్ గారు అలా అన‌లేదు. అత‌డి స్పంద‌న చాలా డిఫ‌రెంట్ అని ఆనందం వ్య‌క్తం చేశారు మ‌హి. ఇక ఏదైనా సినిమా చేయాలంటే మ‌మ్ముట్టి త‌న పాత్ర‌కు త‌నే డ‌బ్బింగ్ చెప్పుకుంటారు. త‌న పాత్ర డ‌బ్బింగ్ లేదంటే ఆయ‌న న‌టించ‌ర‌ని మ‌హి.వి.రాఘ‌వ్ తెలిపారు. ఆయ‌న ఎంతో మ‌న‌సు పెట్టి చేసిన చిత్ర‌మిద‌ని అన్నారు.

రియ‌ల్ లైఫ్ పాత్ర తీసుకుంటే ఎవ‌రేమ‌ని అనుకుంటారో అనే భ‌యంతో తీసి ఉంటే ఇది చేసేవాళ్లం కాద‌ని ఆయ‌న అన్నారు. ఇది వైయ‌స్సార్ బ‌యోపిక్ .. కానీ రాజ‌కీయాలేవీ లేవు. ఈ సినిమా చూసి ప్ర‌భావిత‌మై ఎవ‌రూ ఓటూ వేయ‌రు. రాజ‌కీయంతో సంబంధ‌మే లేదు. ఇదో హ్యూమ‌న్ డ్రామా.. ఎమోష‌న్స్ ఉంటాయి.. అని నిర్మాత‌లు తెలిపారు. ఇక ఈ చిత్రంలో అన్ని పాట‌ల్ని సీతారామ‌శాస్త్రి రాశారు. మేం చేసిన వంట బావుంద‌ని మేం అంటాం. కానీ ఆడియెన్ జ‌డ్జి చేయాలి. మూవీలో స‌త్తా ఉంది అంటేనే సినిమా చూడండి. ఎవ‌రైనా చూశాక వారి అభిప్రాయం తీసుకుని సినిమా చూడండి. ట్రైల‌ర్ - టీజ‌ర్ - పాటలు ఆక‌ట్టుకున్నాయి... సినిమా ఆక‌ట్టుకుంటుంది అని అన్నారు.