Begin typing your search above and press return to search.

జగన్ పాత్రన్నా చేయండి గురూ!!

By:  Tupaki Desk   |   22 March 2018 2:30 AM GMT
జగన్ పాత్రన్నా చేయండి గురూ!!
X
టాలీవుడ్లో కూడా బయోపిక్ ల హవా బాగానే నడుస్తోంది. మహి. వి. రాఘవ వైఎస్ ఆర్ జీవిత చరిత్రను 'యాత్ర' అనే టైటిల్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి విడుదల అవుతున్న ప్రతి అప్డేట్ ఒక హాట్ టాపిక్ గా మారిపోతోంది. ఇందులో జగన్ పాత్ర ఎవరు పోషించనున్నారు అని రెండు తెలుగు రాష్ర్టాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

వైఎస్ ఆర్ పై సినిమా అంటే అందులో కచ్చితంగా వైఎస్ జగన్ గురించి కచ్చితంగా చూపించాల్సిందే. ఏదేమైనా సినిమా వైఎస్ ఆర్ మృతితో ఆపేస్తే బావుండదు. జగన్ పాత్ర కూడా సినిమాలో కీలకంగా మారుతుంది. జగన్ పాత్ర పక్కన పెడితే వైఎస్ ఆర్ పాత్ర చేయడానికే ఏ తెలుగు హరో కూడా ముందుకు వచ్చేటంత ధైర్యం చేయలేకపోయారనేది ఒక టాక్. అందుకే రాఘవ స్క్రిప్ట్ ను మలయాళం స్టార్ హీరో మామూట్టి వద్దకు తీసుకెళ్లగా - ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సినిమాలో ఇప్పుడు వైఎస్ ఆర్ పాత్ర లో మమ్మూట్టి కనిపించనున్నారు. మరి జగన్ పాత్ర చేయడానికి ఎవరు ముందుకొస్తారు? ఇండస్ట్రీలో చాలా మందే యంగ్ హరోలు ఉన్నారు. జగన్ పాత్ర ను పోషించే టాలెంట్ ఉన్న యాక్టర్లు ఉన్నారు. కానీ వారిలో ఎవరు చేయడానికి ముందుకొస్తారు అన్నది డౌటే. ముఖ్యంగా రాజకీయంగా జగన్ ఇప్పుడు టాప్ స్వింగులో ఉన్నారు కాబట్టే.. ఆయన పాత్రంటే మనోళ్ళు అంతలా భయపడుతున్నారు.

ఇప్పటికే దర్శకుడు కొందరిని అడగగా వాళ్ళు కాస్త మొహమాట పడుతున్నారనట. మరి మహి మాత్రం ఏం చేస్తాడు. మమ్మూట్టి లాగానే జగన్ పాత్రకు కుడా వేరే బాషనుండి యాక్టర్ ని తెచ్చుకుందాం అనే ఆలోచనలు చేస్తున్నారని యూనిట్ మెంబెర్ అందించిన సమాచారం. కానీ తెలుగు సినిమా - పైగా గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ ఆర్ జీవితంపై సినిమా. తెలుగు వాళ్ళను కాకుండా వేరేవాళ్లంటే బావుంటుంది అంటారా?