Begin typing your search above and press return to search.

16 ఏళ్ల తర్వాత సూపర్‌ స్టార్‌ సినిమా రీ రిలీజ్

By:  Tupaki Desk   |   23 July 2022 6:15 AM GMT
16 ఏళ్ల తర్వాత సూపర్‌ స్టార్‌ సినిమా రీ రిలీజ్
X
16 సంవత్సరాల క్రితం వచ్చిన మహేష్ బాబు పోకిరి గురించి ఇప్పటికి కూడా మాట్లాడుకుంటున్నాం.. మహేష్ బాబు సినిమాల గురించి మాట్లాడుకునే సమయంలో ఇప్పటికి కూడా పోకిరి చర్చ వస్తుంది అంటే ఆ సినిమా ఎంతటి సంచలన విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీ హిట్ సాధించిన పోకిరి అంతకు మించి జనాల్లో నిలిచి పోయింది.

కలెక్షన్స్ చాలా సినిమాలకు వస్తాయి.. చాలా సినిమా లు ఇండస్ట్రీ హిట్‌ గా ఉంటాయి. కాని సినిమాలోని డైలాగ్స్.. సినిమాలోని సన్నివేశాలు.. సినిమాలోని ట్విస్ట్‌ ఇలా ప్రతి ఒక్కటి కూడా దశాబ్ద కాలం దాటినా మాట్లాడుకోవడం.. చర్చించుకోవడం జరుగుతుంది అంటే అది కేవలం పోరికి సినిమా కే ఘన దక్కింది అనుకోవచ్చు.

పోరికి సినిమా డైలాగ్స్ ఇంకా కూడా మోస్ట్‌ పాపులర్‌.. పోకిరి సినిమా క్లైమాక్స్ ట్విస్ట్‌ ఇప్పటికి కూడా మోస్ట్‌ క్రేజీ క్లైమాక్స్ గా ఉంది అనడంలో సందేహం లేదు. అందుకే ఇప్పటికి కూడా పోకిరి ఒక ప్రెష్‌ మూవీ గానే ప్రేక్షకులు ముఖ్యంగా అభిమానులు చూస్తారు. ఈ జనరేషన్ ప్రేక్షకులు కూడా పోకిరి సినిమా ను చూసి ఇష్టపడే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి.

అందుకే పోరికి ని ఈ ఏడాది మహేష్ బాబు బర్త్‌ డే సందర్బంగా రీ రిలీజ్‌ చేయాలనే ఉద్దేశ్యంతో 4కే అల్ట్రా సౌండ్‌ కు మార్చారు. వచ్చే నెల 9వ తారీకున మహేష్ బాబు బర్త్‌ డే సందర్బంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా భారీ ఎత్తున రీ రిలీజ్ కు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఏ ఒక్క సినిమా కు దక్కని రీ రిలీజ్ పోకిరి కి దక్కబోతోంది.

డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ దర్శకత్వంలో రూపొందిన పోకిరి సినిమాలో మహేష్ బాబుకు జోడీగా ఇలియానా నటించిన విషయం తెల్సిందే. సినిమా లో నాజర్ కీలక పాత్రలో నటించగా ప్రకాష్ రాజ్ విలన్ గా కనిపించాడు.

ముమైత్ ఖాన్‌ ఐటెం సాంగ్‌ అప్పటి నుండి ఇప్పటి వరకు అల్లాడిస్తూనే ఉంది. పోరికి మళ్లీ ట్రెండ్‌ సెట్‌ చేసేంతగా వసూళ్లను రాబట్టి సక్సెస్ అవుతుందో చూడాలి.