Begin typing your search above and press return to search.

యూఎస్‌ లో సర్కారు వారి వేట షురూ

By:  Tupaki Desk   |   9 May 2022 5:34 AM GMT
యూఎస్‌ లో సర్కారు వారి వేట షురూ
X
సూపర్ స్టార్‌ మహేష్ బాబు సినిమా సక్సెస్ అయినా ప్లాప్ అయినా యూఎస్ తో పాటు పలు ఏరియాల్లో ఒక మోస్తరు వసూళ్లు నమోదు అవ్వడం చాలా కామన్‌ విషయం. ఇప్పుడు ప్రతి చిన్న హీరో పెద్ద హీరో తమ సినిమాలతో యూఎస్ లో మిలియన్ డాలర్లను దక్కించుకుంటున్నారు కాని మొదట్లో కేవలం మహేష్ బాబుకు మాత్రమే మిలియన్ డాలర్ల వసూళ్లు యూఎస్ లో సాధ్యం అయ్యింది.

యూఎస్ లో మహేష్‌ బాబుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉండటం వల్లే కేవలం యూఎస్ఏ లోనే దాదాపుగా 700 లొకేషన్స్ లో విడుదలకు సర్కారు వారి పాట సినిమాను సిద్దం చేశారు. విడుదల తేదీ దగ్గర పడుతోంది. విడుదలకు ఒక్క రోజు ముందే సర్కారు వారి పాట సినిమా ప్రీమియర్స్ ను యూఎస్ లో వేయబోతున్నారు.

అడ్వాన్స్ బుకింగ్ మొదలు అయ్యింది. అమెరికా వ్యాప్తంగా భారీ ఎత్తున అడ్వాన్స్ బుకింగ్స్ నమోదు అవుతున్నట్లుగా సమాచారం అందుతోంది. మహేష్‌ ప్రతి ఒక్క సినిమా కూడా అక్కడ కుమ్మేస్తూ ఉంటుంది. ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుందని అంటున్నారు. యూఎస్ లో సర్కారు వారి పాట సినిమా జోరు ఏ స్థాయిలో ఉందో టెక్సాస్ రాష్ట్రంలో జరుగుతున్న అడ్వాన్స్ బుకింగ్‌ చెప్పకనే చెబుతున్నాయి.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం టెక్సాస్ రాష్ట్రంలో అడ్వాన్స్ బుకింగ్‌ ప్రారంభం అయిన కొన్ని గంటల్లోనే $100K వసూళ్లు నమోదు అయినట్లుగా తెలుస్తోంది. లాంగ్ రన్‌ లో కేవలం టెక్సాస్ లోనే మిలియన్ డాలర్లను వసూళ్లు చేసేనా అంటూ చర్చ కూడా జరుగుతోంది.

ఇతర యూఎస్ రాష్ట్రాల్లో కూడా సర్కారు వారి వేట షురూ అయ్యింది అన్నట్లుగా జోరు కనిపిస్తుంది. భారీ ఎత్తున వసూళ్లు నమోదు అవుతున్న ఈ సమయంలో యూఎస్‌ కు సంబంధించిన టాక్ ఎలా ఉంటుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పరశురామ్‌ దర్శకత్వంలో రూపొందిన సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా వెన్నెల కిషోర్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.

సినిమా లోని కళావతి మరియు మమ మహేష పాట ఖచ్చితంగా థియేటర్‌ లో దుమ్ము రేపడం ఖాయం అంటూ అభిమానులు ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో కీర్తి సురేష్ రోల్‌ గురించి కూడా ప్రథానంగా చర్చ జరుగుతోంది. కనుక తప్పకుండా యూఎస్ లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో మరియు ఇతర ప్రాంతాల్లో కూడా సర్కారు వారి పాట యొక్క కలెక్షన్స్‌ వేట ఓ రేంజ్ లో ఉండే అవకాశం ఉంది.