Begin typing your search above and press return to search.

#బేబి ఇన్ ఆర్మ్స్.. హాయిగా నిదుర‌పో పాపాయి

By:  Tupaki Desk   |   3 Jun 2021 5:00 PM IST
#బేబి ఇన్ ఆర్మ్స్.. హాయిగా నిదుర‌పో పాపాయి
X
హాయిగా నిదుర‌పో పాపాయి.. కంటి నిండా క‌ల‌త లేని నిదుర పో చిన్నారి..!! సూప‌ర్ స్టార్ మ‌హేష్ గారాల ప‌ట్టీ సితార ఘ‌ట్ట‌మ‌నేని ఇలా అర‌చేతిలోనే ఎంత హాయిగా నిదుర‌పోతోందో క‌దా.. తండ్రి భుజాన్ని త‌ల‌గ‌డ‌గా చేసుకుని నిదురిస్తూ క‌లలు కంటోంది. మ‌హేష్ కూడా త‌న గారాల‌బేబీని ప్రేమ‌గా హ‌త్తుకుని హాయిగా నిదురిస్తున్నారు.

ఈ అరుదైన‌ ఫోటోని ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన న‌మ్ర‌త .. వేకువ ఝామున బేబీని అలా కౌగిలించుకుని నిదుర‌పోవ‌డం మ‌స్ట్.. అలా చేయ‌కపోతే ఉద‌య‌మే నిదుర లేవ‌లేం. #వేక‌ప్ మంత్ర # బేబి ఇన్ ఆర్మ్స్ # ల‌వ్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించారు.

గ‌త కొంత‌కాలంగా సెకండ్ వేవ్ ప్ర‌భావంతో మ‌హేష్ ఇంట్లోనే రిలాక్స్ అవుతున్నారు. త్వ‌ర‌లోనే స‌ర్కార్ వారి పాట షెడ్యూల్ ని ప్రారంభించాల్సి ఉంది. అప్ప‌టివ‌ర‌కూ ఇంట్లో త‌న గారాల‌ప‌ట్టీల‌తో మ‌ధుర‌మైన క్ష‌ణాల్ని ఆస్వాధిస్తున్నారు. ఇలాంటి అరుదైన అవ‌కాశాన్ని అస్స‌లు విడిచిపెట్ట‌రు మ‌హేష్. ఈ లాక్ డౌన్ లో త‌మ ఇంటి ప‌నివాళ్లంద‌రికీ వ్యాక్సినేష‌న్ చేయించారు. త్వ‌ర‌లో స‌ర్కార్ వారి.. సెట్స్ లోనూ అంద‌రికీ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ఉంటుంద‌ని తెలుస్తోంది.