Begin typing your search above and press return to search.

ఇంటర్నేషనల్‌ బ్రాండ్ పట్టిన సూపర్ స్టార్‌

By:  Tupaki Desk   |   16 April 2022 10:34 AM GMT
ఇంటర్నేషనల్‌ బ్రాండ్ పట్టిన సూపర్ స్టార్‌
X
టాలీవుడ్ స్టార్స్ లో అత్యధిక బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న స్టార్‌ మహేష్ బాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయన హీరోగా వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు వరుసగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ దూసుకు పోతున్నాడు.

లోకల్ నుండి నాన్ లోకల్‌ వరకు ఎన్నో బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించిన మహేష్ బాబు ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా అంతర్జాతీయ స్థాయి బ్రాండ్ కు అంబాసిడర్ గా వ్యవహరించబోతున్నాడు.

ఇంటర్నేషనల్‌ రేంజ్ మోడల్స్ మరియు స్టార్స్ అంబాసిడర్స్ గా వ్యవహరించే ఆడి కారు కు ఇప్పుడు మహేష్‌ బాబు అంబాసిడర్‌ గా వ్యవహరించబోతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా సౌత్‌ ఇండియా మొత్తం కూడా మహేష్ బాబు పేరు తో ఆడి మార్కెట్ ను పెంచేందుకు కంపెనీ ప్రయత్నాలు చేస్తుంది.

ఆడి కంపెనీ కారుకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు గాను మహేష్‌ బాబు భారీ పారితోషికంను తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటి వరకు ఆయన తీసుకున్న పారితోషికాల అన్నింటికంటే ఎక్కువగా ఆడి పారితోషికం అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా తుది వర్క్ లో బిజీగా ఉన్నాడు. షూటింగ్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. హీరోగా ఆయన వరుసగా సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

మహేష్ బాబు సర్కారు వారి పాట విడుదల అవ్వడమే ఆలస్యం జూన్ లో త్రివిక్రమ్‌ మూవీ పట్టాలెక్కబోతుంది. ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేయబోతున్నాడు.