Begin typing your search above and press return to search.

మహేష్‌28 మూవీ రెండు ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్‌

By:  Tupaki Desk   |   2 May 2021 8:30 AM GMT
మహేష్‌28 మూవీ రెండు ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్‌
X
సూపర్‌ స్టార్‌ అభిమానులతో పాటు త్రివిక్రమ్ అభిమానులు సినీ ప్రేమికులు గత పదేళ్లుగా ఎదురు చూస్తున్న మూవీ రాబోతుంది. ఖలేజా సినిమా తర్వాత మహేష్‌ బాబు మరియు త్రివిక్రమ్‌ ల కాంబోలో మూవీ అదిగో ఇదిగో అన్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని దాదాపు 11 ఏళ్లు వీరిద్దరి కాంబో మూవీ కోసం అభిమానులు ఎదురు చూడాల్సి వచ్చింది. ఎట్టకేలకు వీరి కాంబో మూవీని అధికారికంగా ప్రకటించిన విషయం తెల్సిందే. మహేష్‌ బాబు 28వ సినిమాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా పట్టాలెక్కబోతుంది. ఈ సినిమా గురించిన రెండు విషయాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌ బాబు తండ్రి సూపర్‌ స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్బంగా మే 31వ తారీకున ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్‌ డేట్స్‌ ను ఇవ్వబోతున్నారట. అందులో భాగంగా సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేస్తారని తెలుస్తోంది. సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేయడంతో పాటు టైటిల్‌ లోగోను మోషన్‌ పోస్టర్‌ తో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారట. ఈ విషయమై అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్స్‌ విషయమై కూడా కీలక సమాచారం అందుతోంది.

మహేష్‌ బాబుకు జోడీగా ఈ సినిమా లో పూజా హెగ్డే నటించబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. త్రివిక్రమ్ సినిమా అంటే ఇద్దరు ముద్దుగుమ్మలు ఉంటారు. ఈ సినిమాలో ఇద్దరు ముద్దుగుమ్మలకు చాలా ప్రాముఖ్యత ఉంటుందట. అందుకే ఈ సినిమాలో పూజా హెగ్డే తో పాటు బాలీవుడ్‌ బ్యూటీ దిశా పటానీని తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చారట. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఆమెతో చర్చలు కూడా జరిపారట. మెయిన్‌ హీరోయిన్‌ గా పూజా కనిపించనుండగా రెండవ హీరోయిన్‌ గా దిశ కనిపించబోతుంది. టైటిల్‌ మరియు హీరోయిన్స్‌ విషయంలో మే 31 వ తారీకున క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.