Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్ సినిమాకు సూపర్ డేట్!

By:  Tupaki Desk   |   26 May 2019 1:20 PM GMT
సూపర్ స్టార్ సినిమాకు సూపర్ డేట్!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈమధ్యే తన ల్యాండ్ మార్క్ 25 వ సినిమా 'మహర్షి' తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ సినిమాలోని వీకెండ్ ఫార్మింగ్ కాన్సెప్ట్.. రైతులకు గౌరవం ఇవ్వాలనే మెసేజ్ చాలామంది ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. 'మహర్షి' ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొన్న మహేష్ అవన్నీ పూర్తి చేసుకొని ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్ళాడు. ఇదిలా ఉంటే మహేష్ తన నెక్స్ట్ సినిమాను అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన లాంచ్ డేట్ ను ఫైనలైజ్ చేశారని సమాచారం. మహేష్ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు మే 31. ఆయన జన్మదినం సందర్భంగా మహేష్26 చిత్రానికి కొబ్బరికాయ కొట్టేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్నారట. మహేష్ సినిమాను లాంచ్ చేసేందుకు అంతకంటే బెస్ట్ డేట్ ఏముంటుంది చెప్పండి?

ఈ సినిమా రెగ్యులర్ షూటింగును జూన్ నెలాఖరులో ప్రారంభిస్తారట. అనిల్ రావిపూడి గత సినిమాల స్టైల్లో ఈ సినిమా కూడా ఒక అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా ఉంటుందని సమాచారం. 'దూకుడు' తర్వాత మహేష్ బాబుకు మళ్ళీ ఆ రేంజ్ లో ఉండే ఎంటర్టైనర్ మళ్ళీ పడలేదు. ఆ లోటును ఈ సినిమా తీర్చేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్.