Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఉమెన్స్ డే ట్వీట్‌.. త‌ల్లి-భార్య‌-కూతురు ఫొటో షేర్ చేసి...

By:  Tupaki Desk   |   8 March 2021 12:51 PM GMT
మ‌హేష్ ఉమెన్స్ డే ట్వీట్‌.. త‌ల్లి-భార్య‌-కూతురు ఫొటో షేర్ చేసి...
X
ప్ర‌తీ పురుషుడి జీవితంలో మ‌హిళ పాత్ర వెల‌క‌ట్ట‌లేనిది. అస‌లు.. మ‌హిళ‌లేని పురుషుడి జీవితాన్ని ఊహించ‌లేం. అంత ప్ర‌ధాన‌మైన మ‌హిళ‌ల సేవ‌ను, త్యాగాన్ని గుర్తుచేసుకునే రోజే.. ఈ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం.

ఈ గొప్ప సంద‌ర్భంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించారు. త‌న ఫ్యామిలీతో మ‌హేష్ ఎలాంటి రిలేష‌న్ మెయింటెయిన్ చేస్తాడో అంద‌రికీ తెలిసిందే. అదే విష‌యాన్ని మ‌రోసారి నిరూపించాడు. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ లో పోస్టు చేశాడు.

ఈ పోస్టులో త‌న త‌ల్లి, భార్య‌, కూతురు ఫొటోల‌ను షేర్ చేశారు ప్రిన్స్‌. నా చుట్టూ ఉన్న మ‌హిళ‌లతోపాటు ప్ర‌పంచంలోని మ‌హిళ‌లంద‌రికీ మ‌హిళా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు అని రాసుకొచ్చాడు మ‌హేష్. ఆయ‌న షేర్ చేసిన ఫొటోలు నెటిజ‌న్ల‌ను బాగా ఆక‌ట్టుకుంటున్నాయి.

ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట తొలి రెండు షెడ్యూల్స్‌ కంప్లీట్ చేసుకొని విరామంలో ఉన్నారు మ‌హేష్‌. త్వ‌ర‌లో మూడవ షెడ్యూల్.. హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో ప్రారంభమవుతుంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాకు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.