Begin typing your search above and press return to search.

భార్యకు ప్రేమతో.. అంటున్న సూపర్ స్టార్

By:  Tupaki Desk   |   22 Jan 2020 6:05 AM GMT
భార్యకు ప్రేమతో.. అంటున్న సూపర్ స్టార్
X
గ్లామర్ ఇండస్ట్రీలో వివాహాలు కలకాలం నిలిచి ఉండవని.. ఊరికే విడాకులు తీసుకుంటారని ఒక అపోహ ఉంది. మన చుట్టూ సమాజంలో ఉన్నట్టే గ్లామర్ ఇండస్ట్రీలో కూడా విడాకులు తీసుకునేవారు ఉంటారు. అయితే ఇక్కడ విడాకుల విషయాలకు ఎక్కువగా పబ్లిసిటీ జరుగుతుంది.. దానివల్ల అలా అనిపిస్తుందేమో. సాధారణ అభిప్రాయానికి భిన్నంగా మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాంటి కపుల్స్ ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది ఉంటారు. వారిలో మహేష్ బాబు - నమ్రతల జోడీ ఒకటి.

ఈరోజు నమ్రత పుట్టినరోజు. ఈ సందర్భంగా మహేష్ మరోసారి తన సతీమణిపై ప్రేమను చాటుకున్నారు. ప్రస్తుతం మహేష్ తన కుటుంబంతో కలిసి అమెరికా వెకేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. తన ట్విట్టర్ ఖాతా ద్వారా నమ్రత ఫోటో పోస్ట్ చేసి "నా జీవితంలోని మహిళకు.. నా జీవిత భాగస్వామికి జన్మదిన శుభాకాంక్షలు. జస్ట్ లవ్ అండ్ మోర్ లవ్. నమ్రత" అంటూ ట్వీట్ చేశారు. గతంలో ఒక ఇంటర్వ్యూలో మహేష్ తన సతీమణి గురించి మాట్లాడుతూ తను ఇంత సంతోషంగా ఉండడానికి.. నమ్రత సపోర్టే కారణం అని చెప్పాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు సోదరి మంజుల కూడా నమ్రత కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా లో వదినమ్మ కు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు.

మహేష్ గురించి మనందరికీ తెలుసు. నమ్రత గురించి చెప్పుకుంటే.. 1993 లో మిస్ ఇండియా కిరీటం గెలుచుకున్న నమ్రత ఫిలిం ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఎన్నో విజయవంతమైన బాలీవుడ్ చిత్రాల్లో నటించారు. తెలుగులో కూడా హీరోయిన్ గా నటించారు. మహేష్ కు జోడీగా 'వంశీ' సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ సమయంలోనే ప్రిన్స్ తో ప్రేమలో పడ్డారు.. 2005 లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి నటనకు దూరంగా ఉంటూ పిల్లల కోసం.. కుటుంబం కోసం సమయం కేటాయిస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఉండే బెస్ట్ కపుల్స్ లో మహేష్ - నమ్రత ముందు వరస లో ఉంటారని చెప్పడం లో ఏమాత్రం సందేహం లేదు.