Begin typing your search above and press return to search.
'మేకప్ మెన్' పోస్ట్ పెట్టి మనసులు గెలిచిన సూపర్ స్టార్!!
By: Tupaki Desk | 8 July 2020 4:40 PM ISTకరోనా లాక్ డౌన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందర్నీ కూడా లాక్ చేసి పడేసింది. సెలబ్రిటీ సామాన్యుడు అనే తేడా లేకుండా అందరినీ ఇళ్లకే పరిమితం చేసింది. దీంతో ఎప్పుడూ షూటింగ్స్, సినిమాలంటూ దేశ విదేశాలకు ఇతర ప్రాంతాలకు చక్కర్లు కొట్టే సినీతారలు సైతం ఇళ్లకే పరిమితమయ్యారు. ఫ్యామిలీస్‌తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటి వేళ తమ ఇంట్లో జరుగుతున్న విశేషాలన్నీ సోషల్ మీడయాలో షేర్ చేస్తున్నారు. నిజానికి టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లాక్ డౌన్ ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ చాలా యాక్టివ్‌గా ఉంటారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మరోసారి సూపర్ స్టార్ అనిపంచుకున్నాడు. అదెలా అంటే ఆయన పర్సనల్ మేకప్ మెన్ పుట్టినరోజు గుర్తుంచుకొని మరీ నేడు సోషల్ మీడియాలో.. వారిద్దరూ కలిసి ఉన్న ఫోటో పెట్టి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ చేసాడు.
మహేష్ బాబు లాంటి స్టార్ హీరో వేరే స్టార్లకు శుభాకాంక్షలు తెలిపాడంటే ఆశ్చర్యపోయే అవసరం లేదు. కానీ మేకప్ మెన్ పుట్టినరోజు నాడు కూడా సోషల్ మీడియా ముఖంగా పోస్ట్ చేయడం ప్రశంసించాల్సిన విషయమే. మహేష్ వద్ద మేకప్ మెన్ గా పట్టాభి గత కొన్నేళ్లుగా పని చేస్తున్నాడట. అంతేగాక పోస్ట్ లో పట్టాభి గురించి.. సినిమా మొదలైన టైం నుండి సినిమా షూటింగులో చివరి షాట్ వరకు టచ్ అప్ చేసే ఏకైక వ్యక్తి ఆయనే అంటూ పేర్కొన్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో మహేష్ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చెబుతోంది మహేష్ మంచి మనసు ఏమిటో అని అభిమానులు.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా 'సరిలేరు మీకెవ్వరు' సినిమా తర్వాత హీరో మహేష్‌బాబు మరో సినిమాకు రెడీ అయ్యారు. గీతగోవిందం ఫేమ్ పరుశరామ్ దర్శకత్వంలో 'సర్కారు వారి పాట' సినిమాలో నటించేందుకు సిద్ధమయ్యారు.