Begin typing your search above and press return to search.

సంక్రాంతి పందెం: పవన్ Vs మహేష్

By:  Tupaki Desk   |   28 Feb 2021 10:00 AM GMT
సంక్రాంతి పందెం: పవన్ Vs మహేష్
X
టాలీవుడ్ లో ఒక అరుదైన ఘ‌ట్టాన్ని చూడ‌బోతున్నాం. 2022 సంక్రాంతి సీజన్ మునుపెన్న‌డూ ఏ సంక్రాంతికి లేనంత గ్రాండ్ గా థియేట‌ర్ల‌ను వేడెక్కించ‌నుంది. రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాల‌కు తెర తీయ‌నున్నాయి. ఈ రెండిట్లో ఇద్దరు క్రేజీ అగ్ర హీరోలు న‌టించ‌డంతో స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇంత‌కీ ఆ ఇద్దరు ఎవ‌రు? అంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ .. సూపర్ స్టార్ మహేష్ .. ఈ ఇద్దరు పోటీ షురూ అయ్యింది.

మహేష్ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో న‌టిస్తున్నారు. మొదటి షెడ్యూల్ ఇటీవల దుబాయ్ లో పూర్త‌యింది. త‌దుప‌రి షెడ్యూల్స్ పైనా ప‌ర‌శురామ్ వ‌ర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సీజన్లో ఈ చిత్రం తెరపైకి వస్తుందని నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. తాజా ప‌వ‌ర్ స్టార్ పవన్ క‌ల్యాణ్‌.. రేసులో చేరారు.

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ క‌థానాయ‌కుడిగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న‌ పీరియడ్ డ్రామా 2022 సంక్రాంతి బ‌రిలోనే థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అ రెండు సినిమాలు ప్లాన్ ప్రకారం విడుదల చేస్తే.. బాక్సాఫీస్ వద్ద భీక‌ర పోరు త‌ప్ప‌ద‌నే అర్థ‌మ‌వుతోంది. వీరంతా పాన్ ఇండియా అప్పీల్ ఉన్న‌వారే కావ‌డంతో ఈ పోటీని అభిమానులు కూడా ఆస్వాధిస్తార‌న‌డంలో సందేహం లేదు. పండ‌గ సీజ‌న్ కి థియేటర్లు కిట‌కిట‌లాడ‌డం ఖాయం అని అంచ‌నా వేస్తున్నారు.