Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కోసం మహేష్ ట్వీట్
By: Tupaki Desk | 11 May 2021 5:58 AM GMTఎన్టీఆర్ కరోనా బారిన పడ్డ విషయం తెల్సిందే. తాను క్షేమంగా ఉన్నాను కాని స్వల్ప లక్షణాలతో కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన వెంటనే కొన్ని లక్షల మంది అభిమానులు సోషల్ మీడియా ద్వారా ఆయన ఆరోగ్యం బాగుండాలంటూ ప్రార్థిస్తూ గెట్ వెల్ సూన్ మెసేన్ ను ఎన్టీఆర్ ను ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. కేవలం నందమూరి అభిమానులు మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఎన్టీఆర్ కు గెట్ వెల్ సూన్ చెప్పారు.
ఇక సినిమా ప్రముఖులు కూడా ఎన్టీఆర్ ఆరోగ్యంపై స్పందించారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ లో స్పందించాడు. గెట్ సూన్ బ్రదర్ నీ కోసం ప్రార్థిస్తున్నాం అంటూ ట్వీట్ చేశాడు. మహేష్ బాబు ట్వీట్ కు విపరీతమైన స్పందన వచ్చింది. మహేష్ బాబు ట్వీట్ ను వేల మంది రీ ట్వీట్ చేశారు. ఎన్టీఆర్.. మహేష్ బాబు.. రామ్ చరణ్ ల అభిమానులు గొడవలు పడుతూ ఉంటారు. కాని వారు మాత్రం చాలా క్లోజ్ గా ఉంటారనే విషయం గతంలోనే వెళ్లడయ్యింది.
ఎన్టీఆర్ కరోనా బారిన పడ్డ విషయం చెప్పిన వెంటనే ఎంతో మంది సినీ ప్రముఖులు స్పందించారు. అయితే మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ స్పందించడం చాలా ప్రత్యేకం అంటూ ఇద్దరు హీరోల అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరి మద్య స్నేహం ఇలాగే కొనసాగాలని ఆశిద్దాం. ఎన్టీఆర్ ను మహేష్ బాబు బ్రదర్ అంటూ సంభోదించడం కూడా చాలా మందికి నచ్చింది.