Begin typing your search above and press return to search.
మహేష్.. త్రివిక్రమ్ మూవీ లాంచింగ్ రూమర్
By: Tupaki Desk | 6 Dec 2021 2:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న ప్రస్తుత సినిమా సర్కారు వారి పాట. ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. ఈ నెల లేదా వచ్చే నెలలో సర్కారు వారి పాట చిత్రీకరణ పూర్తి అవ్వనుండగా వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమాను విడుదల చేయబోతున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే.
సినిమా షూటింగ్ ముగింపు దశకు వచ్చిన నేపథ్యంలో మహేష్ బాబు తదుపరి సినిమా గురించిన పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మహేష్ బాబు తదుపరి సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో అంటూ కొన్ని నెలల క్రితమే కన్ఫర్మ్ అయ్యింది. మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబో మూవీ కోసం పదేళ్లుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే ఇప్పటి వరకు షూటింగ్ ప్రారంభం అయ్యి.. వచ్చే సమ్మర్ లో సినిమా వచ్చేది. కాని సినిమా ను వచ్చే ఏడాదిలోనే ప్రారంభించాలని చూస్తున్నారు. సర్కారు వారి పాట షూటింగ్ పూర్తి చేసిన తర్వాత త్రివిక్రమ్ మూవీ ఉంటుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ లాంచింగ్ కు సంబంధించి ఒక రూమర్ జోరుగా సాగుతోంది.
అదేంటి అంటే ఈ సినిమా ఫిబ్రవరి నెలలో ప్రారంభం కాబోతుందట. మొదటి షెడ్యూల్ లో హైదరాబాద్ లో వేసిన సెట్టింగ్ లో పాట చిత్రీకరణ చేస్తారట. ఆ పాట కు కొరియోగ్రఫీని జానీ మాస్టర్ అందించబోతున్నట్లుగా కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఆ సినిమాకు సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు.. కాని ఇలాంటి పుకార్లు మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చాయి.. వస్తున్నాయి.
మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబో లో గతంలో అతడు మరియు ఖలేజా సినిమాలు వచ్చాయి. ఈ సినిమా ల ఫలితాలు చాలా విభిన్నం. థియేటర్ లో ఈ రెండు సినిమాలు కూడా కమర్షియల్ గా ప్లాప్ ను చవి చూశాయి. కాని టీవీ ల్లో మాత్రం ఈ సినిమా లు రెండు సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి.
ఇప్పటికి ఈ సినిమాలు టీవీలో వస్తున్నాయి అంటే ఖచ్చితంగా జనాలు అలా టీవీలకు అతుక్కు పోయి కూర్చుంటారు. ముఖ్యంగా అతడు సినిమా కొన్ని వేల సార్లు స్టార్ మా నెట్ వర్క్ లో టెలికాస్ట్ అయ్యింది. అయినా కూడా ప్రేక్షకులు బోర్ ఫీల్ అవ్వడం లేదు. అందుకే వీరి కాంబోలో రాబోతున్న మూడవ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఫిబ్రవరిలో సినిమా పట్టాలెక్కితే సినిమా విడుదల వచ్చే ఏడాది చివర్లో లేదా 2023 లో అయినా ఉంటుందని అంటున్నారు.