Begin typing your search above and press return to search.
అన్నయ్య కు మహేష్ స్వీట్ విషెస్!
By: Tupaki Desk | 13 Oct 2021 8:00 PM ISTసూపర్ స్టార్ కృష్ణ తనయుడు..మహేష్ అన్నయ్య రమేష్ బాబు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండి తెరకు పరిచయమైన రమేష్ బాబు కొన్ని సినిమాల్లో నటించారు. కానీ నటుడిగా స్థిరపడలేదు. ఆ తర్వాత కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు. ఆ రంగంలో కూడా రమేష్ బాబు రాణించలేదు. చివరిగా సినిమా ఇండస్ర్టీకి గుడ్ చెప్పి వ్యాపారాల్తో స్థిరపడ్డారు. ఇటీవలే రమేష్ బాబు పేరు మళ్లీ తెరపైకి వస్తోంది. మళ్లీ నిర్మాతగా రాణించే ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో వార్తలొస్తున్నాయి. అన్నయ్య ను పెద్ద నిర్మాతగా చూడాలని తమ్మడు మహేష్ సైతం ఆశపడుతున్నట్లు ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు.
రమేష్ సినిమాలు నిర్మిస్తానంటే తన బ్యానర్లో మొదటి సినిమా తానే చేస్తానని ప్రామిస్ కూడా చేసారు. ప్రస్తుతం తెలుగు సినిమా మార్కెట్ కూడా అంతకంతకు విస్తరించింది. పాన్ ఇండియా రేంజ్ కి తెలుగు సినిమా చేరుకుంది. మహేష్ సైతం తన పారితోషికాన్నే పెట్టుబడిగా పెట్టి లాభాల్లో వాటాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే మరుగున పడిన పద్మాలయ స్టూడియోస్ ని సైతం రీ లాంచ్ చేయాలని చూస్తున్నారు. అందుకు రమేష్ బాబు కూడా ఆసక్తి చూపిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. ఆ సంగతి పక్కన బెడితే నేడు రమేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన సన్నిహితులు..కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా మహేష్ ట్విటర్ వేదికగా రమేష్ బాబుకి విషెస్ తెలియజేసారు. నన్ను ఎంతగానో ఇన్ ప్లూయెన్స్ చేసే రమేష్ అన్నయ్యకు హ్యాపీ బర్త్ డే అంటూ మహేష్ ట్వీట్ చేసారు. అలాగే తండ్రి కృష్ణ...అన్నయ్య రమేష్ బాబు తో కలిసిదిగిన ఓ పాత ఫోటోని షేర్ చేసారు. ప్రస్తుతం మహేష్ `సర్కారు వారి పాట`లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి పరశురాం బుజ్జి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం సినిమా సెట్స్ లో ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.