Begin typing your search above and press return to search.
కృష్ణ బర్త్ డే నాడు మహేష్ ఇవ్వబోయే గిఫ్ట్ అదేనా..?
By: Tupaki Desk | 8 May 2020 4:30 PM GMT'మే 31' అనేది సూపర్ స్టార్ మహేష్ బాబుకి ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే ఆ రోజు తన తండ్రి కృష్ణ పుట్టినరోజు. గత కొన్ని సంవత్సరాలుగా ఆ రోజున తన సినిమాలకి సంభందించి ఏదో ఒక అప్డేట్ ఇవ్వడం మహేష్ కి సెంటిమెంట్ గా వస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే బర్త్ డేకి కూడా మరో అప్డేట్ తో రానున్నాడు మహేష్. సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న మహేష్ బాబు.. ఆ తర్వాత నెక్స్ట్ సినిమాకి సంభందించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వాస్తవానికి వెంటనే తన కెరీర్లో 27వ చిత్రాన్ని స్టార్ట్ చేయాలని మహేష్ భావించినప్పటికీ కరోనా కారణంగా సైలెంట్ అయ్యాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఆయన తదుపరి చిత్రం చేస్తారనే వార్తలు వచ్చినప్పటికీ ఎందుకో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. కాగా ‘గీతా గోవిందం’ ఫేమ్ పరుశురామ్ చెప్పిన కథ నచ్చిన మహేష్ తన నెక్స్ట్ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఆయనకు అప్పగించారు. ఈ విషయాన్ని డైరెక్టర్ పరశురామ్ కూడా ఒక ఇంటర్వ్యూలో ప్రకటించాడు. లాక్ డౌన్ లేకుంటే ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యేది.
అయితే సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజున పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్ స్టార్ట్ అవుతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో షూటింగ్ స్టార్ట్ చేయకూడదని చిత్ర యూనిట్ భావిస్తోందట. కాకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ తన తండ్రి బర్త్ డే సందర్భంగా అభిమానులకు ఎదో ఒక సర్‌ప్రైజ్ ఇవ్వాలనే ఆలోచనలో మహేష్ బాబు ఉన్నారని సమాచారం. ఇప్పటికే పరుశురామ్ సినిమాకు సంబంధించి ఆఫీసియల్ అంనౌన్సమెంట్స్ తో పాటు ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ మరియు మహేష్ స్టైలిష్ లుక్ ను విడుదల చేసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. అయితే కృష్ణ బర్త్ డే రోజు ఫ్యాన్స్ కి గిఫ్ట్ అయితే ఉంటుంది.. కానీ అది ఏమిటని చెప్పలేమని సూపర్ స్టార్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఆ రోజు ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వడం పక్కా అని అర్థం అవుతోంది. దీని కోసం సూపర్ స్టార్ అభిమానులు మే 31 కోసం ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ మరియు 14 రీల్స్, ఎంబీ ప్రొడక్షన్స్ సంస్థలు కలిసి నిర్మించే ఛాన్సెస్ ఉన్నాయని సమాచారం.