Begin typing your search above and press return to search.

మరో సారి అలాంటి పాత్రలో మహేష్?

By:  Tupaki Desk   |   28 Feb 2023 8:00 AM GMT
మరో సారి అలాంటి పాత్రలో మహేష్?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తన 29వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరి కాంబోలో తెరకెక్కుతున్న మూడవ సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్ లో మోస్ట్ ఎక్సైటింగ్, అవైటెడ్ ప్రాజెక్టుల్లో SSMB 28 ఒకటి. ఇప్పటికే 30 శాతం షూటింగ్ పూర్తి కాగా ఈ సినిమాని త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు.

ఇక ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడిగా పూజ హెగ్డే నటిస్తుంది. ఈమెతో పాటు మరో హీరోయిన్ ఈ శ్రీలీల కూడా నటిస్తుందని ప్రచారం అయితే జరుగుతుంది. శ్రీలీలతో మహేష్ బాబుకు ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి మరొక విషయం బయటకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమాలో మహేష్ బాబు సూపర్ కాప్ గా కనిపించనున్నట్లు తెలుస్తుంది. అయితే ఇదే నిజం అయితే థియేటర్లో మరోసారి పూనకాలు లోడింగ్ అవడంలో సందేహం లేదు.

అయితే మహేష్ పోలీస్ గా నటించిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచిన విషయం తెలిసిందే. టాలీవుడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన పోకిరిలో మహేష్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా నటించి మహేష్ అలరించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన ఆగడు సినిమాలో కూడా పోలీస్ ఆఫీసర్ గా మహేష్ నటించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. స్పైడర్, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో దాదాపు ఇలాంటి రోల్ చేశాడు. ఇక చాలా గ్యాప్ తర్వాత ఇలాంటి క్యారెక్టర్ లో మహేష్ బాబు నటిస్తారని ప్రచారం అయితే జరుగుతుంది.

అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కావడంతో ఇది కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతుందంటూ అభిమానులు అంతా అనుకుంటున్నారు. ఇక మహేష్ బాబు నటించిన దూకుడు, ఆగడు, సర్కారు వారి పాట సినిమాలకు మ్యూజిక్ అందించిన తమన్ మరోసారి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా హారిక హాసిని క్రియేషన్స్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.