Begin typing your search above and press return to search.
కన్ఫ్యూజన్ మహేష్ లోనా.. పరశురామ్ లోనా?
By: Tupaki Desk | 11 March 2020 4:48 AM GMTఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయిన నటుడు మహేష్‌బాబు. సోషల్ మీడియా ఇంత బలంగా విస్తరించినా మహేష్ వాస్తవంలోకి రాలేకపోతున్నాడు. ఆయన సినిమాలకు సంబంధించిన కలెక్షన్ల వివరాలన్నీఇప్పటికీ ఫేక్ అనే వార్తలు తరచూ వినిపిస్తుంటాయి. ఇటీవల ఆయన నటించిన `సరిలేరు నీకెవ్వరు` కలెక్షన్ల వివరాలు కూడా నిజం కాదనే కామెంట్స్ బలంగా వినిపించాయి. పోటీబరిలోని `అల వైకుంఠపురములో` కలెక్షన్ల దుమారంతో దూసుకు పోతుంటే దీనిపై మహేష్ సీరియస్ గానే ఆలోచించారని వార్తలొచ్చాయి.
ఇక సరిలేరు ఫేక్ కలెక్షన్లపై బోలెడన్ని సెటైర్లు పంచ్ లు మహేష్ కంటికి కునుకు కరువయ్యేలా చేశాయట. దాని పర్యవసానమే ఎంబీ 27 ఎవరితో అన్న డైలమా నెలకొంది. మహేష్ నెక్ట్స్ సినిమా ఎవరితో అన్న కన్‌ఫ్యూజన్ నుంచి బయటపడలేకపోతున్నారు. పైడిపల్లిని పక్కన పెట్టి పరశురామ్ ని లైన్ లోకి తెచ్చేశారంటూ ప్రచారమైనా అందులో నిజం లేదని ఓ సెక్షన్ మీడియా వాదిస్తోంది.
ప్రస్తుతం పరుశురామ్ ఈ స్క్రిప్ట్ పై వర్క్ చేస్తున్నారని ప్రచారమైంది. అయినా ఇంకా ఈ కన్ఫ్యూజన్ తొలగిపోలేదు. ఇలాంటి డైలమా నడుమ మహేష్ నెక్ట్స్ సినిమా వంశీ పైడిపల్లితోనా? పరుశురామ్ తోనా అనే కన్‌ఫ్యూజన్ ఫ్యాన్స్ లో నెలకొంది. ఇదిలా ఉంటే పరుశురామ్ సైతం రకరకాల డైలమాల నడుమ ఇబ్బందికరంగానే ఉన్నాడన్నది తాజా సమాచారం. ఇటీవల నాగచైతన్యతో ఓ సినిమా చేసేందుకు కమిటైన పరశురామ్.. దానిని అధికారికంగా ప్రకటించారు. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న.. పూజా హెగ్డే ఎవరో ఒకరు ఖాయమని తెరపైకి వచ్చింది. అయితే ఆ తర్వాత మహేష్ తో సినిమా ఖాయమైందంటూ ప్రచారం సాగిపోవడంతో ఇప్పుడు అందరిలోనూ ఒకటే కన్ఫ్యూజన్. మరి పరుశురామ్ మొదట నాగచైతన్యతో చేస్తాడా? లేక మహేష్ తో చేస్తాడా అనేది అంతా కన్ ఫ్యూజన్‌గా మారింది. అయితే పరశురామ్ దీనిపై పూర్తి క్లారిటీతో ఉన్నాడా? అంటే అట్నుంచి కూడా సరైన ఆన్సర్ లేదు. దీంతో పరశురాముడిలోనూ కన్ ఫ్యూజన్ ఉందని అర్థం చేసుకోవాల్సి వస్తోంది. వీటన్నిటికీ ఫుల్‌స్టాప్ పడాలంటే మహేష్ తరపున నమ్రత గానీ స్పందించాల్సిందే.