Begin typing your search above and press return to search.

స్ట‌డీస్ కోసం మ‌హేష్ వార‌సుడు విదేశాల‌కు..!

By:  Tupaki Desk   |   16 July 2022 6:31 AM GMT
స్ట‌డీస్ కోసం మ‌హేష్ వార‌సుడు విదేశాల‌కు..!
X
సూపర్ స్టార్ మహేష్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో బిజీ కానున్న సంగ‌తి తెలిసిందే. త్రివిక్ర‌మ్ మూవీతో పాటు.. ద‌ర్శ‌కధీరుడు రాజ‌మౌళితో సినిమా చేసేందుకు మ‌హేష్ స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. త్వరలో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

కానీ ఇంత‌లోనే మ‌హేష్ విదేశీ వెకేష‌న్ల‌తో బిజీ అయ్యారు. ఇటీవ‌ల నమ్ర‌త స‌హా కిడ్స్ తో పారిస్ టూర్ ముగించిన మ‌హేష్ ఇంత‌లోనే లండ‌న్ కి వెళ్లార‌ని తెలిసింది. అయితే దీనివెన‌క కార‌ణం వేరొక‌టి ఉంది. అందుకు సంబంధించిన‌ టాప్ సీక్రెట్ తాజాగా బ‌య‌ట‌ప‌డింది.

మహేష్ బాబు తన వార‌సుడు గౌతమ్ కోసం విదేశాల్లో బెస్ట్ స్కూల్స్ ని వెతుకుతున్నార‌ని స‌మాచారం. ఒక ప్ర‌ముఖ‌ తెలుగు నిర్మాత కొడుకు ఇప్పటికే అడ్మిషన్ పొందిన ఉన్నత పాఠశాలలో గౌత‌మ్ కృష్ణ‌కు అడ్మిషన్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

మహేష్ ఫ్యామిలీ ఇప్ప‌టికే లండ‌న్ విజిట్ కి వెళ్లొచ్చారు. ఇప్పుడు మ‌రోసారి అక్క‌డ‌ క్యాంపస్ ని సందర్శించనున్నార‌ని తెలిసింది. అక్క‌డ గౌత‌మ్ అడ్మిషన్ ను ఖాయం చేసుకుని మహేష్ హైదరాబాద్ కు తిరిగి రానున్నారు. ఆగ‌స్టులో గౌత‌మ్ లండ‌న్ కి వెళ‌తార‌ని కూడా వెల్ల‌డైంది.

న‌ట‌వార‌సులు విదేశాల్లో విద్య‌ను అభ్య‌సించ‌డం రెగ్యుల‌ర్ గా చూస్తున్నదే. సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఫారిన్ లోనే చ‌దువు పూర్తి చేసి ఇండియాకి వ‌చ్చారు. 'రాజ‌కుమారుడు' చిత్రంతో హీరోగా కెరీర్ ని ప్రారంభించ‌క ముందు మ‌హేష్ అమెరికాలో స్ట‌డీస్ కొన‌సాగించారు.

అక్కినేని నాగార్జున కూడా విదేశాల్లోనే ఎంబీఏ పూర్తి చేసారు. బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ సుహానా ఖాన్.. ఖుషీ క‌పూర్ కూడా విదేశాల్లోనే స్ట‌డీస్ ని కొన‌సాగించారు. నేటిత‌రం లో చాలా మంది విదేశాల్లో విద్య‌ను పూర్తి చేసుకుని సినీరంగంలో కొన‌సాగుతున్న‌వారు ఉన్నారు. ర‌క‌ర‌కాల కార‌ణాల‌ వల్ల గౌతమ్ ని లండన్ లోని స్కూల్ కి పంపడానికి మహేష్ బాబు మొగ్గు చూపుతున్నార‌ని తెలుస్తోంది.