Begin typing your search above and press return to search.
మీడియాను చూసి ఇబ్బంది పడ్డ గౌతమ్
By: Tupaki Desk | 11 Feb 2023 6:35 PM GMTహైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్ నడిబొడ్డున ఫార్ములా ఈ- కార్ రేసింగ్ గ్రాండ్ గా ప్రారంభమైంది. అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న ఈ రేసింగ్ పోటీలను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. అందుకోసం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేసింది.
ఈ ఫార్ములా రేసింగ్ ప్రమోషన్స్ కోసం సినీతారలు సైతం దిగి వచ్చి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే సినీ, క్రీడా రంగాలకు చెందిన పలువురు సెలబ్రిటీలు ఫార్ములా-ఇ రేసింగ్‌ను సందర్శించారు. మహేష్ బాబు సతీమణి నమ్రత, కొడుకు గౌతమ్, ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతితో పాటు నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి కూడా ఈ ఈవెంట్‌లో సందడి చేశారు.
అయితే నిజానికి .. మహేష్ కొడుకు గౌతమ్ ఈ రేసును సందర్శించడం స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. మహేష్ బాబు కుమార్తె సితార నిత్యం సోషల్ మీడియాలో అభిమానులతో టచ్ లో ఉంటూ తండ్రి గురించి ముచ్చట్లు చెప్పుకొంటూ వస్తోంది. కానీ గౌతమ్ మాత్రం అలా కాదు. కొద్దిగా నెమ్మదిగా ఉంటాడు. సోషల్ మీడియాకు దూరంగా ఉంటాడు. ఎప్పుడో తండ్రితో తప్ప బయట కనిపించడు.
మీడియాలోను తక్కువగా కనబడతాడు. అలాంటిది ఈ రోజు రేస్ దగ్గర కనపడటం సూపర్ స్టార్ అభిమానుల్లో జోష్ ను నింపింది. మరోవైపు ఈ రేస్ షోలో గౌతమ్ నీ చూడగానే మీడియా ప్రతినిధులు కూడా అతడి ఇంటర్వ్యూలు తీసుకునేందుకు ఎగబడ్డారు. అయితే అతడు కెమెరా ముందు కనపడేందుకు, మీడియాతో మాట్లాడేందుకు కాస్త ఇబ్బంది పడ్డాడు. చాలా తక్కువగానే మాట్లాడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
ఈ క్రమంలోనే గౌతమ్ మాట్లాడుతూ.. ఈ రేస్ అంటే చాలా ఇష్టమని, చిన్నప్పుడు నుంచి చాలా ఎక్సైటింగ్ గా చూస్తానని తెలిపాడు. మొదటిసారిగా బెల్జియం లో ఈ రేసు తను వీక్షించినట్లు తెలిపాడు. ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉందని వెల్లడించాడు.
ఇకపోతే ప్రస్తుతం గౌతమ్ విదేశాల్లో చదువుకుంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే స్కూల్ లో జరిగిన ఒక ప్రోగ్రామ్ లో గౌతమ్ అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. థియేటర్ ప్రొడక్షన్ లో ఒక స్కిట్ చేస్తూ కనిపించాడు. వన్ నేనొక్కడినే సినిమాలో కెమెరా ముందు నటించిన గౌతమ్ చాలా కాలం తరువాత ఇలా స్టేజిపై కనిపించి అభిమానులని ఆకట్టుకున్నాడు. ఈ డ్రామా లోక్ ఇంగ్లిష్ లో డైలాగులతో అదరగొట్టడమే కాకుండా హావభావాలను చక్కగా పలికించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.