Begin typing your search above and press return to search.

మహేష్ - రాజమౌళి.. హీరోయిన్ ఎవరంటే?

By:  Tupaki Desk   |   8 Jun 2022 1:30 AM GMT
మహేష్ - రాజమౌళి.. హీరోయిన్ ఎవరంటే?
X
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమాలలో మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్ట్ టాప్ లిస్టులో ఉంటుందనే చెప్పాలి. ఈ సినిమాకోసం కేవలం తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాకుండా నార్త్ ఆడియన్స్ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

మహేష్ బాబు రాజమౌళి కలయికలో ఓ సినిమా రాబోతుందన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ పై అనేక రకాల కథనాలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

అసలైతే పదేళ్ల క్రితమే మహేష్ బాబుతో దర్శకధీరుడు సినిమా చేయాలని అనుకున్నాడు. కానీ ఇద్దరు కూడా మిగతా ప్రాజెక్టులతో ఒకదాని తర్వాత ఒకటి స్టార్ట్ చేయడంతో మధ్యలో గ్యాప్ దొరకలేదు. ఇక ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అంచనాలకు తగ్గట్టుగా మహేష్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రాజమౌళి ప్రయత్నాలు చేస్తున్నాడు.

ఇక రాజమౌళి నిర్ణయాలకు తగ్గట్టుగానే మహేష్ బాబు కూడా సిద్ధంగా ఉన్నాడు. ముఖ్యంగా డేట్స్ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి అని మహేష్ బాబు కొత్త ప్రాజెక్టులను సైతం ఓకే చేయడం లేదు.

ఏదైనా మళ్ళీ రాజమౌళి ప్రాజెక్ట్ తరువాతే అంటున్నారు. ఇక మరొకవైపు ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో కూడా ఒక టాక్ అయితే గట్టిగానే వైరల్ అవుతుంది. ఇది వరకే కొంత మంది పేర్లు వినిపించాయి కానీ చిత్ర యూనిట్ సభ్యులు అయితే ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.

ఇక ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సాహో బ్యూటీ శ్రద్ధాకపూర్ అయితే అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనే దర్శక ధీరుడు రాజమౌళి ఆలోచిస్తున్నట్లు సమాచారం. సాహో సినిమా తర్వాత శ్రద్ధా కపూర్ కు కొన్ని పాన్ ఇండియా ఆఫర్లు వచ్చినప్పటికి కూడా కథలు నచ్చకపోవడంతో పెద్దగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు ఇక ఇప్పుడు మహేష్ బాబు రాజమౌళి మూవీ అంటే ఆమె ఏ మాత్రం ఆలోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది అని చెప్పవచ్చు.