Begin typing your search above and press return to search.

మహేష్‌ రాజమౌళి సినిమా.. ఓ చిన్న అప్‌డేట్‌

By:  Tupaki Desk   |   21 Jun 2022 4:30 PM GMT
మహేష్‌ రాజమౌళి సినిమా.. ఓ చిన్న అప్‌డేట్‌
X
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ఇటీవలే విడుదల అయిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా హడావుడి ఇంకా కొనసాగుతూనే ఉంది. దేశ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను దక్కించుకుని రికార్డులు బ్రేక్ చేసిన ఆ సినిమా తర్వాత జక్కన్న కాస్త గ్యాప్ తీసుకుని మళ్లీ ఇప్పుడు తదుపరి సినిమా వర్క్ లో పడ్డట్లుగా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆయన తదుపరి సినిమా మహేష్‌ బాబుతో కన్ఫర్మ్‌ అయిన విషయం తెల్సిందే.

గత కొన్నాళ్లుగా మహేష్ బాబుతో రాజమౌళి సినిమా గురించిన వార్తలు సోషల్‌ మీడియాలో జోరుగా వస్తున్నాయి. ఎట్టకేలకు వీరి కాంబో మూవీ పట్టాలెక్కుతోంది. రాజమౌళి ప్రస్తుతం తన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ తో కలిసి స్క్రిప్ట్‌ వర్క్ మొదలు పెట్టారట. జక్కన్న దాదాపు అన్ని సినిమాలకు కూడా ఆయన తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ కథ ను అందిస్తున్నారు. ఈ సినిమాకు కూడా ఆయనే రచయితగా వ్యవహరించబోతున్నాడు.

రాజమౌళి ఇప్పటికే ఒక స్టోరీ లైన్ ను అనుకున్నాడని.. దాన్ని కథ గా మార్చే పనిలో ఉన్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయి స్క్రిప్ట్‌ గా మార్చుతారు. రాజమౌళి తన హీరోలు ఎవరికి అయినా స్క్రిప్ట్‌ పూర్తిగా చెప్పడు అనే టాక్ ఉంది. మరి మహేష్ బాబుకు అయినా రాజమౌళి పూర్తి కథను చెప్పబోతున్నాడా లేదా అనేది తెలియాల్సి ఉంది.

ప్రస్తుతానికి ఈ సినిమా గురించి స్క్రిప్ట్‌ వర్క్ షురూ చేశారు. స్టోరీ లైన్ రెడీ అయ్యింది అనే అప్‌డేట్‌ మాత్రమే అందుతోంది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రాజమౌళి టీమ్‌ నుండి వస్తాయేమో చూడాలి. జక్కన్న రాజమౌళి ఈ సినిమాను వచ్చే ఏడాది ఆరంభంలో పట్టాలెక్కించే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ఇక ఈ సినిమాను భారీ యాక్షన్ అడ్వంచర్ మూవీగా దాదాపుగా 500 కోట్ల బడ్జెట్‌ తో తెరకెక్కించేందుకు గాను ప్లాన్‌ చేస్తున్నాడట. ఈ బడ్జెట్‌ షూటింగ్‌ మొదలు అయ్యి.. పూర్తి అయ్యేప్పటికి పెరిగినా ఆశ్చర్యం లేదు. జక్కన్న 500 కోట్లు కాదు.. వెయ్యి కోట్లు పెట్టినా వెనక్కు తీసుకు రాగల ధీరుడు అనే అభిప్రాయం ప్రతి ఒక్క నిర్మాతకు ఉంటుంది. అందుకే మహేష్ బాబు సినిమా కు ఆ భారీ బడ్జెట్‌ రిస్క్ ఏమీ కాదు.

మహేష్‌ బాబు తో ఒక సూపర్‌ అడ్వంచర్ మూవీని తెరకెక్కించేందుకు రాజమౌళి స్క్రిప్ట్‌ రెడీ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అదే తరహా కథను ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ రెడీ చేసే పనిలో ఉన్నాడనే వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ సినిమా అధికారిక ప్రకటన కోసం అంతా వెయిట్‌ చేస్తున్నారు.