Begin typing your search above and press return to search.
మరోసారి కూతురు సితారతో సూపర్ స్టార్..
By: Tupaki Desk | 8 May 2020 7:00 AM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు మిస్ అయిన సమయమంతా ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాడు. కుటుంబానికి ఎంతో విలువ ఇస్తాడు మహేష్. కరోనా కారణంగా ఇంటికే పరిమితం అయిన ఆయన కాలు కూడా బయట పెట్టట్లేదట. కరోనా లాక్ డౌన్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందర్నీ కూడా లాక్ చేసి పడేసింది. పేద ధనిక తేడా లేకుండా అందర్నీ ఇళ్లకే పరిమితం చేసింది. దీంతో ఎప్పుడూ షూటింగ్స్, సినిమాలంటూ దేశ విదేశాలకు ఇతర ప్రాంతాలకు చక్కర్లు కొట్టే సినీ తారలు సైతం ఇళ్లలోనే ఉంటున్నారు. ఫ్యామిలీస్ తో హ్యీపీగా ఎంజాయ్ చేస్తున్నారు. లాక్ డౌన్ వేళ తమ ఇంటిలో జరుగుతున్న విశేషాలన్నింటిని సోషల్ మీడయాలో షేర్ చేస్తున్నారు. తాజగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉన్నారు.
'సరిలేరు మీకెవ్వరు' సినిమా తర్వాత హీరో మహేష్‌బాబు మరో సినిమాకు రెడీ అయ్యారు. పరుశరామ్ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఓ సినిమా తర్వాత మరో సినిమా షూటింగ్‌కు వెళ్లే మధ్యలో మహేష్ కనీసం రెండు నెలల గ్యాప్ తీసుకుంటాడు. వీలుంటే విదేశాలకు వెళ్తాడు. లేదంటూ కుటుంబంతో ఇంట్లోనే గడుపుతారు. లాక్‌డౌన్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో మహేష్ ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో ఇద్దరు పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. తాజాగా మహేష్, సితారకు సంబంధించిన ఓ అద్బుతమైన ఫోటోని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇక ముఖ్యంగా కూతురు సితార అయితే మహేష్ ని ఒక్క క్షణం కూడా వదలడం లేదట. తాజాగా మహేష్ కూతురుతో ఆడుకుంటూ దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.