Begin typing your search above and press return to search.

జక్కన్న సినిమా కంటే ముందే మహేష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్..!

By:  Tupaki Desk   |   10 Aug 2021 12:30 PM GMT
జక్కన్న సినిమా కంటే ముందే మహేష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్..!
X
టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు నేషనల్ వైడ్ మార్కెట్ విస్తరించుకునే పనిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే స్టార్ హీరోల దగ్గర నుంచి కుర్ర హీరోల వరకు అందరూ తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ప్రభాస్ - పవన్ కళ్యాణ్ - ఎన్టీఆర్ - రామ్ చరణ్ - అల్లు అర్జున్ - విజయ్ దేవరకొండ - కళ్యాణ్ రామ్ - మంచు మనోజ్ - అడవి శేష్ - సందీప్ కిషన్ - ఆది సాయి కుమార్.. ఇలా ప్రతీ హీరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే హాలీవుడ్ కటౌట్ తో ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇంతవరకు పాన్ ఇండియా చిత్రాన్ని అనౌన్స్ చేయలేదు.

పాన్ ఇండియా సినిమా చేయకుండానే మహేష్ నేషనల్ వైడ్ ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నారు. అదే అన్ని భాషల్లో సినిమాని రిలీజ్ చేస్తే మహేష్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందని సినీ అభిమానులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి తో సూపర్ స్టార్ ప్రాజెక్ట్ సెట్ అయింది. 'బాహుబలి' దర్శకుడి ఏ సినిమా అయినా జాతీయ స్థాయిలో విడుదల అవుతుందనే సంగతి తెలిసిందే. దీంతో మహేష్ చేసే ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇదే అవుతుందని అందరూ ఫిక్స్ అయ్యారు.

అయితే ఇప్పుడు జక్కన్న సినిమా కంటే ముందే మహేష్ నుంచి పాన్ ఇండియా చిత్రం వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహేష్ ప్రస్తుతం నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హ్యాట్రిక్ మూవీ చేయనున్న విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప‌తాకంపై ఎస్. రాధాకృష్ణ‌ (చిన‌బాబు) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.

#SSMB28 సినిమా పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని మేకర్స్ మొదటి నుంచీ చెబుతూ వస్తున్నారు. మహేష్ - త్రివిక్రమ్ కాంబోలో యాక్షన్ జోనర్ మూవీ రాబోతోందని నిర్మాత సూర్యదేవర నాగవంశీ మరోసారి స్పష్టం చేశారు. సూపర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన ట్విట్టర్ స్పేస్ సెషన్ లో యువ నిర్మాత మాట్లాడుతూ.. ఇది 'అతడు' 'ఖలేజా' కంటే పెద్ద సక్సెస్ అవుతుందని.. ఇండస్ట్రీ హిట్ కొడతామని కాన్ఫిడెంట్ గా చెప్పుకొచ్చాడు. అంతేకాదు ఇది పాన్ ఇండియా అప్పీల్ ఉన్న యాక్షన్ స్టోరీ అని.. పరిస్థితులను బట్టి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసే ఆలోచన చేస్తామన్నట్లు నాగవంశీ చెప్పారు.

దీనిని బట్టి చూస్తే పరిస్థితులు అనుకూలిస్తే రాజమౌళి సినిమా కంటే ముందే త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంతో మహేష్ బాబు పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేసే అవకాశం కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో దీనిపై క్లారిటీ రానుంది. ఇకపోతే పరాశురామ్ పెట్లా తెరకెక్కిస్తున్న 'సర్కారు వారి పాట' చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. అలానే త్రివిక్రమ్ తో చేసే #SSMB28 చిత్రాన్ని 2022 సమ్మర్ లో రిలీజ్ చేయనున్నాడు. ఆ తర్వాత జక్కన్న ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించనున్నారు మహేష్. ఇకపోతే సందీప్ రెడ్డి వంగా - వంశీ పైడిపల్లి - అనిల్ రావిపూడి - శ్రీను వైట్ల వంటి దర్శకులు మహేష్ బాబుతో సినిమాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. మరి రాజమౌళి సినిమా తర్వాత వీరిలో ఎవరెవరితో సూపర్ స్టార్ కమిట్ అవుతారో చూడాలి.