Begin typing your search above and press return to search.

మ‌హేష్ పాన్ ఇండియా హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్!

By:  Tupaki Desk   |   21 July 2022 5:30 PM GMT
మ‌హేష్ పాన్ ఇండియా హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌క దిగ్గ‌జం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఓ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చే ఏడాది మిడ్ లో సినిమా ప్రారంభం కానుంది. ఆఫ్రిక‌న్ ఫారెస్ట్ నేప‌థ్యంలో సాగే స్టోరీ అని ఇప్ప‌టికే రివీల్ చేసారు. ప్ర‌స్తుతం రాజ‌మౌళి-స్టార్ రైట‌ర్ విజ‌యేంద్ర ప్ర‌సాద్ స్ర్కిప్ట్ సిద్దం చేసే ప‌నిలో ప‌డ్డారు.

'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' రికార్డుల‌న్నింటిని కొల్ల‌గొట్టే స్ర్కిప్ట్ తో రాబోతున్న‌ట్లు ఇప్ప‌టికే అర్ధ‌మైంది. అదీ మ‌హేష్ తో తొలిసారి చేస్తోన్న చిత్రం కావ‌డంతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియాని దాటి పాన్ వ‌ర‌ల్డ్ రీచ్ అయ్యేలా..అసలు సిస‌లైన గ్లోబ‌ల్ సినిమాగా ఆవిష్క‌రించే దిశ‌గా స్ర్కిప్ట్ ని డిజైన్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా కూడా హిస్టారిక‌ల్ ఫిక్ష‌న్ స్టోరీ అని తెలుస్తోంది.

'బాహుబ‌లి'..'ఆర్ ఆర్ ఆర్' త‌ర‌హాలోనే పూర్తిగా ఫిక్ష‌న్ క‌థే అని లీకులందుతున్నాయి. ఆ రెండు సినిమాల ర‌చ‌న కొన్ని న‌వ‌ల‌లు..చ‌రిత్రను ఆధారం చేసుకుని రాసిన పుస్త‌కాలు ఆధారంగా త‌యారు చేసిన క‌థ. అందులో ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత‌ క‌ల్కీ కృష్ణ‌మూర్తి న‌వ‌ల‌లు నుంచి స్పూర్తి పొంద‌ని సంద‌ర్భం ఉండొచ్చని విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు.

ఎన్నో సినిమాల నుంచి ప్రేర‌ణ పొందిన‌ట్లు చెప్పుకొస్తున్నారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ క‌థ‌ల‌న్ని ఒకే జోన‌ర్ కి చెంది ఫిక్ష‌న్ క‌థ‌లే ఉంటాయ‌ని అంటున్నారు. దాన్ని ఆధారంగా చేసుకునే క‌థ‌లో ర‌క‌ర‌కాల లేయ‌ర్లు సిద్దం అవుతాయని..వాటిని బేస్ తోనే విజువ‌ల్ గా సీన్ ఎలా హైలైట్ చేయాల‌న్న దానికి కొన్ని హాలీవుడ్ సినిమాల నుంచి స్ఫూర్తిని పొందుతార‌ని అంటున్నారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ కోసం సిద్దం చేస్తున్న క‌థ కూడా అలాంటిదే అంటున్నారు. ఎన్నో న‌వ‌ల‌ల స‌మూహ‌ర‌మే ఆప్రిక‌న్ బ్యాక్ డ్రాప్ స్టోరీ అయి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. విజ‌యేంద్ర ప్ర‌సాద్ ఎలాంటి క‌థ రాసినా వాటిపై కల్కి కృష్ణ‌మూర్తి ప్ర‌భావం కచ్చితంగా ఉంటుంద‌ని గంటా ప‌థంగా చెబుతున్నారు.

మ‌ణిర‌త్నం తెర‌కెక్కిస్తోన్న 'పొన్నియ‌న్ సెల్వ‌న్' 'బాహుబ‌లి' ని పోలి ఉంటుంద‌ని...ఈ సినిమాకి కాపీ కొట్టి తీస్తున్నార‌ని వ‌స్తోన్న విమ‌ర్శ‌ల వెనుక క‌ల్కి ర‌చ‌న‌ల ప్ర‌భావం అయి ఉంటుంద‌ని ఈ ర‌కంగా గెస్ చేయోచ్చు.