Begin typing your search above and press return to search.

మ‌హేష్ తో 9 కోట్ల డీల్ ఎందు కోసం?

By:  Tupaki Desk   |   30 Aug 2022 7:35 AM GMT
మ‌హేష్ తో 9 కోట్ల డీల్ ఎందు కోసం?
X
టాలీవుడ్ లో వున్న స్టార్ హీరోలు త‌మ క్రేజ్ ని బ‌ట్టి త‌మ వెంట ప‌డుతున్న కార్పొరేట్ బ్రాండ్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా వ్య‌వ‌హరిస్తూ క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో న‌టిస్తున్నారు. ఇంత‌కు ముందు ఈ ట్రెండ్ బాలీవుడ్ లో మాత్ర‌మే ఎక్క‌వ‌గా క‌నిపించేది కానీ ఈ మ‌ధ్య కాలంలో ఇది ద‌క్షిణాది స్టార్స్ కి పాకింది. బాలీవుడ్ స్టార్స్ కు మ‌న వాళ్లు ఏమాత్రం తీసిపోని స్థాయిలో క్రేజ్ ని సొంతం చేసుకోవ‌డంతో చాలా వ‌ర‌కు కంప‌నీలు మ‌న స్టార్స్ వెంట‌ప‌డుతూ బ్రాండ్ అంబాసిడ‌ర్లుగా కాంట్రాక్ట్ లు కుదుర్చుకుంటున్నాయి.

క‌మ‌ర్షియ‌ల్ బ్రాండ్ ల విష‌యంలో టాలీవుడ్ లో వున్న స్టార్ హీరోల్లో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ముందు వ‌రుస‌లో నిలుస్తున్నారు. డెన్వ‌ర్‌, సాయి సూర్యా డెవ‌లాప‌ర్స్‌, మౌంటేయిన్ డ్యూ, బైజూస్‌, ఇంటెక్స్‌, గోల్డ్ విన్న‌ర్‌, పాన్ బ‌హార్‌, అభీ బ‌స్‌, గతంలో థ‌మ్స్ అప్ వంటి బ్రాండ్ ల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రించాడు. అంతే కాకుండా మ్యాట్రిమోనీ వంటి సైట్ ల‌కు కూడా బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తూ కోట్ల‌ల్లో పారితోషికాన్ని సొంతం చేసుకుంటున్నాడు.

తాజాగా మ‌రో డీల్ ని మ‌హేష్ సొంతం చేసుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌ముఖ ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ తో గ‌తంలో రెండు కోట్ల డీల్ చేసుకుని ఓ భారీ ఈవెంట్ కు హాజ‌రు కావ‌డ‌మే కాకుండా స‌ద‌రు ఛాన‌ల్ లో ప్రసారం అయ్యే ప‌లు క్రేజీ సీరియ‌ల్స్ కి కూడా ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రించారు. తాజాగా ఇదే ఎంట‌ర్ టైన్ మెంట్ ఛాన‌ల్ కు ప్ర‌చార క‌ర్త‌గా మ‌హేష్ మ‌రోసారి సైన్ చేయ‌డం విశేషం. ఇందుకు గానూ మ‌హేష్ ఏకంగా రూ. 9 కోట్లు ఛార్జ్ చేస్తున్నార‌ట‌.

తాజా ఒప్పందం ప్ర‌కారం మ‌హేష్ స‌ద‌రు టీవీ ఛాన‌ల్ కు సంబంధించిన రియాలీటీ షోస్‌, టీవీ సీరియ‌ల్స్ తో పాటు సంస్థ ప్రొడ్యూస్ చేసే ప‌లు కార్యక్ర‌మాల‌కు మ‌హేష్ ప్ర‌చారాన్ని క‌ల్పించ‌నున్నార‌ట‌. ఈ డీల్ ఏడాది పాటు కొన‌సాగుతుందని తెలిసింది. ఇప్ప‌టికే స‌ద‌రు చాన‌ల్ కోసం త‌న ముద్దుల కూతురు సితార తో క‌లిసి ఓ డ్యాన్స్ షోలో మ‌హేష్ పాల్గొన‌డం విశేషం.

గ‌త 15 ఏళ్లుగా మ‌హేష్ కార్పొరేట్ బ్రాండ్ ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తూ అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న హీరోగా స‌రికొత్త రికార్డు ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా వుంటే త్రివిక్ర‌మ్ తో మ‌హేష్ చేయ‌బోతున్న 28వ ప్రాజెక్ట్ సెప్టెంబ‌ర్ 8న రామోజీ ఫిల్మ్ సిటీలో లాంఛ‌నంగా ప్రారంభం కాబోతోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా చ‌క చ‌కా జ‌రిగిపోతున్నాయి. హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎపిసోడ్ ని తొలి షెడ్యూల్ లో షూట్ చేయ‌బోతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.