Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ హోస్టుగా అదుర్స్ విలన్

By:  Tupaki Desk   |   7 April 2018 5:47 AM GMT
బిగ్ బాస్ హోస్టుగా అదుర్స్ విలన్
X
ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పుడు బాషబేధం లేకుండా అన్ని లాంగ్వేజ్ లో ప్రసారం కావడానికి సిద్ధమవుతోంది. షో నిర్వాహకులు కూడా స్థానిక లాంగ్వేజ్ కి తగ్గట్టు హోస్ట్ లను నియమిస్తూ మంచి రేటింగ్ అందుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి షోలో వ్యాఖ్యాత ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షోను మొత్తం నడిపించాలి కాబట్టి టాలెంట్ ఉన్న నటులనే సెలెక్ట్ చేసుకుంటున్నారు.

తెలుగులో మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ కమల్ హాసన్ పరవాలేదు అనిపించాడు. ఇకపోతే మరాఠీ లో కూడా బిగ్ బాస్ రానుంది. అక్కడ హోస్ట్ గా ఉండేది ఎవరో తెలుసా?. ఒక్కడున్నాడు సినిమాలో విలన్ గా అందరిని ఆకట్టుకున్న మహేష్ మంజ్రేకర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నారు. ఈ టాలెంట్ నటుడు తెలుగు ఆడియెన్స్ కి బాగా తెలుసు. అదుర్స్ - అఖిల్ - డాన్ శీను వంటి సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

ఇకపోతే మరాఠీ బాషలో కూడా మహేష్ కు మంచి క్రేజ్ ఉంది. దీంతో అయినతోనే బిగ్ బాస్ ను నడిపించాలని డిసైడ్ అయ్యారు. ఏప్రిల్ 15 నుంచి కలర్స్ మరాఠీ లో ఈ షో స్టార్ట్ కానుంది. మరాఠీలకు తప్పకుండా ఈ షో నచ్చునుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ షోకి సంబంధించిన ప్రమోషన్స్ ఉపందుకున్నాయి. మహేష్ మంజ్రేకర్ ప్రభాస్ సాహో సినిమాలో కూడా నటిస్తున్నాడు.