Begin typing your search above and press return to search.
మరోసారి మహేష్ కాలేజ్ బాయ్ అవతారం??
By: Tupaki Desk | 11 May 2020 4:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' తర్వాత పరశురామ్ దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఈ నెల 31వ తారీఖున సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా వస్తుందని అంటున్నారు.
ఈ సినిమా సూపర్ స్టార్ అభిమానులను సాధారణ ప్రేక్షకులను అలరించే విధంగా ఒక కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాలో మహేష్ బాబు పాత్ర గురించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమాలో మహేష్ ఒక కాలేజీ స్టూడెంట్ గా కనిపించబోతున్నాడని అంటున్నారు. మహేష్ ప్రస్తుతం 40 ల వయస్సులో ఉన్నప్పటికీ ఇప్పటికీ యంగ్ లుక్ తో అందరిని ఆకట్టుకుంటున్నారు. తాజాగా లాక్ డౌన్ పీరియడ్ లో ఆయన తన ఇంట్లో పెట్ డాగ్స్ తో సరదాగా గడుపుతున్న ఈ ఫోటోలను చూస్తే మహేష్ నిజంగానే కాలేజ్ స్టూడెంట్ అనిపించక మానదు.
మహేష్ ఈ మధ్య శ్రీమంతుడు.. భరత్ అనే నేను.. మహర్షి సినిమాలలో కొంతసేపు కాలేజ్ స్టూడెంట్ గా కనిపించారు. అలానే ఈ సినిమాలో కూడా మహేష్ ఓ కాలేజీ ఎపిసోడ్ లో స్టూడెంట్ గా కనిపిస్తారు. ఈ పాత్రను పోషించడం కోసం మహేష్ ఈ మధ్య కొంత బరువు కూడా తగ్గి మరింత స్లిమ్ గా అయ్యారని టాక్ వినిపిస్తోంది.
