Begin typing your search above and press return to search.

మ‌హేష్ ఏదో కొత్త‌గా ట్రై చేస్తున్నారు.. అదేంటి?

By:  Tupaki Desk   |   20 Feb 2021 12:00 PM IST
మ‌హేష్ ఏదో కొత్త‌గా ట్రై చేస్తున్నారు.. అదేంటి?
X
టాలీవుడ్ లోనే గొప్ప అంద‌గాడైన హీరోగా మ‌హేష్ లుక్ గురించి చెప్పాల్సిన ప‌నే లేదు. బాలీవుడ్ హీరోల‌కు ధీటైన లుక్ అత‌డి సొంతం. అయితే ఇన్నాళ్లు ఆయ‌న చాలా సాఫ్ట్ గా మాత్ర‌మే క‌నిపించారు. కండ‌లు పెంచి కండ‌ర‌గండ‌డిలా ర‌ఫ్ లుక్ తో క‌నిపించిందే లేదు. మ‌హేష్ ష‌ర్ట్ విప్పి కండ‌లు చూపించిన స‌న్నివేశం ఇంత‌వ‌ర‌కూ హిస్ట‌రీలో లేదు. అప్ప‌ట్లో సుకుమార్ 1 నేనొక్క‌డినే కోసం ష‌ర్ట్ విప్పించే ప్ర‌య‌త్నం చేసినా అది వెన‌క నుంచి సైడ్ నుంచి మాత్ర‌మే పాజిబుల్ అయ్యింది.

కానీ ఇక ఆ అవ‌స‌రం లేనేలేదు. ఈసారి సర్కార్ వారి పాట చిత్రంలో మ‌హేష్ త‌న అభిమానుల‌కు ఊహించ‌ని ట్రీట్ ఇవ్వ‌బోతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది. ఇంత‌కుముందే సూప‌ర్ స్టార్ మ‌హేష్ జిమ్ చేస్తున్న ఫోటోని నమ్ర‌త‌ రివీల్ చేసి దానికోసం అత‌డు ఎంత‌గా శ్ర‌మిస్తున్నారో సుదీర్ఘ వ్యాసం రాయ‌డం సంచ‌ల‌న‌మైంది. అందులో ఎన్నో ర‌హ‌స్యాల్ని నమ్ర‌త వెల్ల‌డించారు.

మ‌హేష్ మారిన‌ లుక్ చూడ‌గానే అభిమానులు స‌ర్ ప్రైజ్ అయ్యారు. అత‌డి హ్యాండ్ సైజ్ మారింది. బైసెప్ ట్రైసెప్ ప‌ర్ఫెక్ట్ గా త‌యార‌య్యాయి. ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ కనిపిస్తోంది. టీష‌ర్ట్ పైనే అలా క‌నిపించారంటే .. ఇక తెర‌పై ష‌ర్ట్ విప్పితే షాక్ తినాల్సిందే. వ‌య‌సు 45 ప్ల‌స్ లో ఉన్నా మ‌హేష్ హార్డ్ వ‌ర్క్ చూసిన వారంతా షాక్ తింటున్నారు. ఇప్ప‌టికే యాబ్స్ .. కార్డియో జిమ్ పైనా పూర్తిగా కాన్ స‌న్ ట్రేట్ చేశారు మ‌హేష్‌.

మొత్తానికి రిజ‌ల్ట్ మాత్రం అదిరింది. జిమ్ కోచ్ స‌మ‌క్షంలో అతడి శిక్షణ ప్ర‌తిఫ‌లించ‌డం చూస్తుంటే అభిమానుల‌కు బ్ర‌హ్మాండ‌మైన ట్రీట్ మునుముందు ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది. స‌ర్కార్ వారి పాట చిత్రీక‌ర‌ణ దుబాయ్ లో శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. బ్యాంక్ కుంభ‌కోణం నేప‌థ్యంలో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ కం ల‌వ్ అండ్ కామెడీ ట్రీట్ ఉంటుంద‌ని తెలిసింది. ఇందులో కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ -14 రీల్ ఎంటెర్ టైన్మెంట్స్-జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.