Begin typing your search above and press return to search.

మహేష్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లబోతున్నాడా...?

By:  Tupaki Desk   |   26 April 2020 6:00 AM IST
మహేష్ ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లబోతున్నాడా...?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది ప్రారంభంలో 'సరిలేరు నీకెవ్వరూ’ సినిమాతో బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టి 'బ్లాక్ బస్టర్ కా బాప్' అనిపించుకున్నాడు. ఈ సినిమా వచ్చి ఇప్పటికి మూడు నెలలవుతున్నా నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మహేష్ ఎటువంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన మహేష్ బాబు అనుకోకుండా వచ్చిన హాలిడేస్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాడు. డైలీ పిల్లలతో ఆడుకుంటూ తనకు దొరికిన సమయాన్ని సంపూర్ణంగా వినియోగించుకుంటున్నారు. మహేష్ తన కెరీర్లో 27వ చిత్రంగా తెరకెక్కబోతున్న నెక్స్ట్ సినిమాకి 'గీతగోవిందం' ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నాడు. గత కొన్ని రోజులుగా ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన మే 31న మహేష్ బాబు తండ్రి కృష్ణ బర్త్ డే సందర్భంగా వస్తున్నదని న్యూస్ వస్తోంది. కానీ మహేష్ అండ్ టీమ్ నుండి దీని గురించి ఆలోచిస్తున్నట్లుగా అనిపించడం లేదట.

దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్న ఈ తరుణంలో సినిమా అనౌన్స్ చేయడం కరెక్ట్ కాదని సూపర్ స్టార్ భావిస్తున్నారట. ఒకవేళ మే 31 తేదీకి కరోనా కంట్రోల్లోకి వచ్చి లాక్ డౌన్ ఎత్తేస్తే మాత్రం ఫార్మాలిటీగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఒక ప్రకటన వచ్చే అవకాశం ఉందట. లాక్ డౌన్ ఎత్తేయకపోతే ఇప్పట్లో ఈ సినిమా గురించి ప్రకటన వచ్చే అవకాశం లేదట. ఎప్పటి నుండో మహేష్ సినిమా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న అభిమానులకు ఇది నిరాశ కలిగించే విషయమనే చెప్పొచ్చు. కాగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును 14 రీల్స్ ఎనెర్టైన్మెంట్స్, మైత్రి మూవీ మేకర్స్ మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఆ తర్వాత మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా ఉండబోతోంది. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే.ఎల్ నారాయణ నిర్మాతగా తెరకెక్కనున్న ఈ చిత్రం 2021 ఇయర్ ఎండింగ్ లేదా 2022 ఫస్ట్ హాఫ్ లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఆర్.ఆర్.ఆర్ విడుదలైన తర్వాత ఈ మూవీ స్క్రిప్ట్ మరియు ప్రీ ప్రొడక్షన్ పనులు స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.