Begin typing your search above and press return to search.

మ‌హేష్ తో మాయావి మొద‌లెట్టేశాడు!

By:  Tupaki Desk   |   27 Dec 2021 1:33 PM GMT
మ‌హేష్ తో మాయావి మొద‌లెట్టేశాడు!
X
అలా ఎన్టీఆర్ తో ప్రాజెక్ట్ కుద‌ర‌లేదు అన‌గానే ఇలా మ‌హేష్ తో ప్ర‌క‌టించేశాడు త్రివిక్ర‌మ్. అటుపై ఎన్టీఆర్ కూడా కొర‌టాల‌తో సినిమాని ఖాయం చేసేశాడు. ప్ర‌స్తుతం ఎవ‌రికి వారు త‌మ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నారు. ఇక‌పోతే త్రివిక్ర‌మ్ ఈపాటికే మ‌హేష్ తో సినిమాని మొద‌లెట్టేయాల్సింది. క్రైసిస్ కాలం ఇబ్బంది పెట్టింది. దానికి తోడు త్రివిక్ర‌మ్ ఇన్నాళ్లుగా స్నేహితుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మూవీ భీమ్లా నాయ‌క్ కోసం శ్ర‌మించారు. ప‌ర్య‌వేక్ష‌కుడిగా ర‌చ‌యిత‌గా ఆ సినిమాకి అన్నీ తానే అయ్యాడు. యువ‌ద‌ర్శ‌కుడు సాగ‌ర్ చంద్ర‌.. యువ‌నిర్మాత వంశీల‌తో క‌లిసి భీమ్లా నాయక్ ని హిట్ చేయ‌డ‌మే ధ్యేయంగా ప‌ని చేశారు త్రివిక్ర‌మ్.

ఇప్పుడు మ‌రో మిష‌న్ కోసం మాయావి సిద్ధ‌మ‌వుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. తాజాగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని ఫిలింన‌గ‌ర్ భ‌వంతిలో క‌లిసి మాటా మంతీ జ‌రుపుతున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతున్నాయి. ఈ భేటీలో త్రివిక్ర‌మ్ - మ‌హేష్ ల‌తో పాటు థ‌మ‌న్.. నిర్మాత‌ నాగ వంశీ కూడా క‌నిపిస్తున్నారు. దీనిని బ‌ట్టి మ్యూజిక్ సిట్టింగ్స్ పై క‌స‌ర‌త్తు గట్టిగానే ఉంద‌ని అర్థం చేసుకోవ‌చ్చు. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి చార్ట్ బ‌స్ట‌ర్ పాట‌లిచ్చిన థ‌మ‌న్ ని వెంట‌నే స‌రిలేరు నీకెవ్వ‌రు కోసం లాక్ చేసిన మ‌హేష్ టీమ్ ఇప్పుడు త్రివిక్ర‌మ్ తోనూ థ‌మ‌న్ నే బ్లాక్ చేసి మ్యాజిక్ చేయాల‌ని చూస్తోంది.

ఈ కొత్త‌ ఫోటోగ్రాఫ్ లో మ‌హేష్ ఎంతో స్టైలిష్ గా బ్లాక్ క‌ళ్ల‌ద్దాల‌తో క‌నిపిస్తే అంతే స్టైలిష్ గా త్రివిక్ర‌మ్ క‌నిపిస్తున్నారు. 50 ఏజ్ లోనూ మాయావి మెరిపిస్తున్నారు. టాప్ టు బాట‌మ్ ఎంతో ల‌గ్జ‌రియ‌స్ గా స్టైల్ ఎలివేష‌న్ తో చంపేస్తున్నారు. ఆయ‌న తొడుక్కున్న కోట్ తో పాటు ఆ పాదాల‌కు ఖ‌రీదైన స్పోర్ట్స్ షూస్ అంతే యూత్ ఫుల్ అప్పియ‌రెన్స్ తెచ్చాయి మ‌రి.