Begin typing your search above and press return to search.
మహేష్ మరో మాస్ దూకుడు చూడబోతున్నాం
By: Tupaki Desk | 17 Nov 2021 8:16 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు నుండి మాంచి మాస్ మసాలా సినిమాను అభిమానులు చాలా రోజులుగా ఆశిస్తున్నారు. దూకుడు రేంజ్ సినిమా కోసం అభిమానులు చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నారు. ఆ సినిమా లో ఎంటర్ టైన్ మెంట్ తో పాటు మంచి ఎలిమెంట్స్ ను కూడా మహేష్ బాబు చూపించాడు.
మళ్లీ ఇన్నాళ్లకు మహేష్ బాబును మరో రేంజ్ మాస్ లుక్ లో మరియు ఒక మంచి కమర్షియల్ పాత్రలో చూడబోతున్నట్లుగా సర్కారు వారి పాట సినిమా యూనిట్ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు. సర్కారు వారి పాట సినిమా లో మహేష్ బాబు పాత్ర లుక్ ఇప్పటికే రివీల్ అయ్యింది. ఎప్పుడు లేనిది రఫ్ గడ్డం మరియు.. హెయిర్ స్టైల్ చూస్తుంటే మహేష్ బాబు దూకుడు మామూలుగా ఉండదేమో అనిపిస్తుందని అభిమానులు అంటున్నారు.
దర్శకుడు పరశురామ్ గీత గోవిందం తర్వాత ఒక మంచి మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా సర్కారు వారి పాట సినిమాను చేస్తున్నట్లుగా చెబుతున్నారు. మహేష్ బాబు అభిమానులు ఈ సినిమా కోసం గత ఏడాది నుండి వెయిట్ చేస్తున్నారు.
సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మహేష్ బాబు నుండి వస్తున్న సినిమా అవ్వడంతో ఖచ్చితంగా మరో రేంజ్ వసూళ్లను అభిమానులు ఆశిస్తారు. ఆ రేంజ్ వసూళ్లు ఈ సినిమాకు దక్కేలా దర్శకుడు పరశురామ్ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో పాటు మహేష్ బాబు అభిమానులు పోకిరి.. దూకుడు ఎలా అయితే గుర్తు పెట్టుకున్నారో అలా సర్కారు వారి పాటను గుర్తు పెట్టుకునేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లుగా చెబుతున్నారు.
మాస్ పాత్రలు మహేష్ బాబుకు అంతగా నప్పవు అనే విమర్శలు ఉన్నాయి. ఆ విమర్శలకు ఈ సినిమా ఖచ్చితంగా సరైన సమాధానం ఇస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా నమ్ముతున్నారు. మహేష్ బాబు కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ నటించింది. సినిమాలో వీరిద్దరి కాంబో రొమాంటిక్ సన్నివేశాలు మరియు లవ్ సన్నివేశాలు కూడా యూత్ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయని అంటున్నారు.
మొత్తానికి మరో రేంజ్ దూకుడు ను సర్కారు వారి పాట సినిమాతో మహేష్ బాబు చూపించడం ఖాయం అయ్యింది. ఇక ఈ సినిమా ను సంక్రాంతికి విడుదల చేయాలని భావించిన కూడా రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సంక్రాంతి బరిలో నిలవడంతో ఏప్రిల్ 1 కి ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.
--