Begin typing your search above and press return to search.

విజయ్‌ సినిమాలో మహేష్‌.. నిజమే కావచ్చు, ఎందుకంటే!

By:  Tupaki Desk   |   9 Jun 2022 12:30 PM GMT
విజయ్‌ సినిమాలో మహేష్‌.. నిజమే కావచ్చు, ఎందుకంటే!
X
తమిళ సూపర్‌ స్టార్‌ తెలుగు లో మొదటి సారి సినిమా చేస్తున్నాడు. తెలుగు దర్శకుడు వంశీ పైడి పల్లి దర్శకత్వంలో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాతో విజయ్‌ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తెలుగు తో పాటు ఒకే సారి తమిళంలో కూడా రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు ఈ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విజయ్ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. తెలుగు లో ఇప్పటి వరకు విజయ్ తన తమిళ సినిమాలతో పెద్దగా సక్సెస్ అయ్యిందే లేదు. డబ్బింగ్‌ సినిమాలతో దక్కించుకోలేక పోయిన సక్సెస్ ను డైరెక్ట్‌ సినిమా తో దక్కించుకోవాలని.. టాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద తన ముద్ర వేసేందుకు విజయ్‌ ఆరాటపడుతున్నాడు. హీరోగా తమిళనాట విజయ్ సూపర్ స్టార్‌ అనే విషయం తెల్సిందే.

అలాంటి సూపర్ స్టార్‌ సినిమా లో మన సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు కీలక గెస్ట్‌ రోల్‌ లో కనిపించబోతున్నాడు అనేది పుకారు. ఇది నూరు శాతం బేస్ లెస్ పుకారే కాని నిజం కావచ్చు అంటూ కొందరు అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దర్శకుడు వంశీ పైడిపల్లికి మహేష్‌ బాబు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అనే విషయం తెల్సిందే.

మహేష్‌ బాబు కు వంశీ స్నేహితుడు మాత్రమే కాకుండా ఆయన బిజినెస్ వ్యవహారాలను కూడా వంశీ చూసుకునేంతగా ఇద్దరు క్లోజ్‌. రెండు ఫ్యామిలీ లు కూడా రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు. వంశీ కూతురు మరియు సితార ఎంత గా క్లోజ్‌ గా ఉంటారో అందరికి తెల్సిందే. అందుకే వంశీ కోసం.. వంశీ కోరితే తప్పకుండా మహేష్‌ బాబు నటించేందుకు ఓకే చెప్పే అవకాశాలు ఉన్నాయి అనేది అభిమానుల మాట.

ఒక వేళ విజయ్ సినిమాలో మహేష్ బాబుతో గెస్ట్‌ రోల్‌ చేయిస్తే సినిమా స్థాయి అమాంతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. తమిళంలో ఎలాగూ విజయ్‌ సినిమా కనుక భారీ ఓపెనింగ్స్‌ ను దక్కించుకుంటుంది. తెలుగు లో భారీ క్రేజ్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా మహేష్ వంటి ఇక్కడి స్టార్స్ ఎవరో ఒకరు కనిపించాలి.. లేదా వినిపించాలి. అప్పుడే సినిమాకు ఇక్కడ బజ్‌ క్రియేట్ అయ్యే అవకాశం ఉందని విశ్లేషకుల అభిప్రాయం.

అందుకోసం అయినా విజయ్ సినిమా లో మహేష్‌ బాబును వంశీ నటింపజేసే అవకాశాలు ఉన్నాయి. స్నేహం ను వంశీ అలా వాడుకుంటాడా అనేది అనుమానమే. కాని పాత్ర డిమాండ్ చేస్తే... ప్రాముఖ్యత ఉంది అనుకుంటే తప్పకుండా విజయ్‌ సినిమా లో మహేష్‌ బాబును నటింపజేయడం గొప్ప ఆలోచన. మరి వంశీ మనసులో ఏముందో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.