Begin typing your search above and press return to search.

మహేష్ తప్ప అందరూ ఆ పాత్రలే ఇచ్చారు

By:  Tupaki Desk   |   7 Feb 2019 11:22 AM GMT
మహేష్ తప్ప అందరూ ఆ పాత్రలే ఇచ్చారు
X
అదేంటో మరి అవకాశాలు చేతిలో ఉన్నన్నాళ్ళు తెలుగు సినిమా గొప్పది ఆహా ఓహో అని పొగడ్తలు గుప్పించేసి అవి తగ్గగానే ఇక్కడ స్టాండర్డ్ లేదు అమ్మాయిలను చులకనగా చూపిస్తారు అంటూ విమర్శలు గుప్పించే హీరొయిన్లు ఎక్కువైపోతున్నారు. తాజాగా అమృత రావు కూడా ఈ బ్యాచ్ లో చేరిపోయింది. పన్నెండేళ్ళ క్రితం మహేష్ బాబు సరసన అతిధి సినిమాలో పరిచయమైన ఈ బ్యూటీ గుర్తుందా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆశించిన విజయం అందుకోలేకపోయింది.

ఇటీవలే నవజుద్దిన్ సిద్దిక్ నటించిన బయోపిక్ లో థాకరేలో అతని భార్యగా నటించిన అమృతా రావు సెకండ్ ఇన్నింగ్స్ ఫ్లాప్ తోనే మొదలుపెట్టాల్సి వచ్చింది. ఈ సందర్భంగా ఓ కార్యక్రమంలో సౌత్ లో మహేష్ తో చేసాక ఒక్క సినిమాతోనే ఆగిపోయారే అని అడిగిన ప్రశ్నకు బదులు ఇస్తూ తర్వాత మూడు పాత్రలు వచ్చాయని అయితే హీరొయిన్ పాత్రని మరీ కామంతో రగిలిపోతూ హీరో వెంటపడేలా కథ చెప్పారని అందుకే రిజెక్ట్ చేసారని చెప్పింది. మరి మహేష్ సినిమాలో మాత్రం మంచి పాత్ర దక్కిందట. ప్రిన్స్ తో పాటు నమ్రతా అందరూ తనకు కుటుంబ సభ్యుల్లా అనిపిస్తారని అంత చక్కని అనుబంధం తమ మధ్య ఉందని చెప్పుకొచ్చింది.

అయితే బయటికి వెళ్ళిపోయాక హీరొయిన్లు తెలుగు సినిమాలను కామెంట్ చేయడం ఇదేమి కొత్త కాదు. ఆ మధ్య తాప్సీ ఏకంగా తన మొదటి సినిమా దర్శకులు రాఘవేంద్ర రావు గారినే వ్యంగ్యంగా మాట్లాడటం చిన్నపాటి రచ్చె చేసింది. ఇప్పుడు అమృత రావు వంతు వచ్చింది. అయితే చేసింది ఒక్క సినిమానే కాబట్టి ఇప్పటి వాళ్ళకు తన గురించి పెద్దగా అవగాహన లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొత్త కెరీర్ కోసం ఎదురు చూస్తున్న అమృత రావు ఇకపై ఎలాంటి ఉదాత్తమైన పాత్రలు చేస్తుందో వేచి చూడాలి