Begin typing your search above and press return to search.
భరత్ హామీ ఇదేనా?
By: Tupaki Desk | 2 May 2018 10:11 PM ISTబ్రహ్మోత్సవం - స్పైడర్ సినిమాల తరువాత మహేష్ కు విజయం రాకుంటే ఆయన ఎంత బాధపడి ఉండే వారో ఇప్పుడున్న సంతోషాన్ని చూస్తుంటే అర్ధమవుతోంది. హిట్ టాక్ అలా వచ్చిందో లేదో సినిమా ప్రమోషన్స్ మరింత పెంచేశారు. ఎక్కడా తగ్గకుండా సక్సెస్ టూర్స్ అంటూ బ్లాక్ బస్టర్ ఈవెంట్స్ అని చాలానే చేశారు. అలాగే ప్రముఖ వ్యక్తుల నుంచి ప్రశంసలు అందడం సినిమాకు ప్లస్ పాయింట్ గా అని చెప్పవచ్చు.
మెగాస్టార్ - కేటీఆర్ అలాగే లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ వంటి వారు స్పెషల్ షో చూసి చిత్ర యూనిట్ ని అభినందించారు. సినిమా సక్సెస్ ను మహేష్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో ఈజీగా అర్ధమయ్యింది. పైగా అందరికి మంచి మెస్సేజ్ ఇచ్చిన చిత్రమని కొనియాడారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మహేష్ పై కొంత నెగిటివ్ కామెంట్స్ రావడం హాట్ టాపిక్ అయ్యింది. ముఖ్యంగా సినిమాకు సంబందించిన ఈవెంట్ నుంచి కారణం చూపిస్తూనే ఇదేనా భరత్ అనే నేను హామీ అంటూ సెటైర్లు విసురుతున్నారు. ఎందుకంటే ఇటీవల సినిమాకు సంబందించిన ఈవెంట్ కు ఓ ప్రయివేట్ విద్యాసంస్థల యాజమాన్యం స్పాన్సర్ షిప్ చేసింది.
వేడుకలో ఆ విద్యా సంస్థల ప్రకటనలు ఎక్కువగా రావడం హాట్ టాపిక్ అయ్యింది. ఎందుకంటే భరత్ అనే నేను సినిమా ఓకే సోషల్ సర్వీస్ లాంటి సినిమా అని ప్రజల వద్దకు చిత్ర యూనిట్ తీసుకెళ్లిందనే చెప్పాలి. ప్రెస్ మీట్ లలో కూడా సామజిక అంశాలను చాలా వివరించారు. పైగా సినిమాలో ప్రయివేట్ విద్యా సంస్థలపై హీరో తీసుకునే కఠిన నిర్ణయాలు ఆసక్తిని కలిగిస్తాయి. కానీ రియల్ లైఫ్ లో మాత్రం మహేష్ ఇలా యాడ్స్ ఇస్తూ ప్రయివేట్ విద్యా సంస్థలకు ప్రచారం కల్పిస్తున్నాడు అని కామెంట్స్ వస్తున్నాయి. మరి ఈ విషయం గురించి చిత్ర యూనిట్ ఎలా స్పదిస్తుందో చూడాలి.