Begin typing your search above and press return to search.

త్రివిక్ర‌మ్ ని ఇరికించిన స్టార్ రైట‌ర్‌!

By:  Tupaki Desk   |   21 Feb 2023 5:00 PM GMT
త్రివిక్ర‌మ్ ని ఇరికించిన స్టార్ రైట‌ర్‌!
X
ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ మునుప‌టితో పోలిస్తే ప్ర‌స్తుతం త‌న పంథాకు పూర్తి భిన్నంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు. 'వ‌కీల్ సాబ్'తో మ‌ళ్లీ రీమేక్ ల బాల ప‌ట్టిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ త‌రువాత మ‌ల‌యాళ హిట్ ఫిల్మ్ 'అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌' ఆధారంగా రూపొందిన‌ 'భీమ్లానాయ‌క్‌'లో న‌టించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం క్రిష్ జాగ‌ర్ల‌మూడి దర్శ‌క‌త్వంలో తొలి పీరియాడిక్ ఫిక్ష‌న్ మూవీ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'లొ న‌టిస్తున్నాడు. ఈ మూవీ ప్రస‌తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుంది.

గ‌త కొన్ని నెల‌లుగా ఆగుతూ సాగుతున్న ఈ మూవీతో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రో మూడు క్రేజీ సినిమాల‌ని లైన్ లో పెట్టిన విష‌యం తెలిసిందే. 'సాహో' ఫేమ్ సుజీత్ డైరెక్ష‌న్ లో ఒరిజిన‌ల్ గ్యాంగ్ స్ట‌ర్ అంటూ ఓ పాన్ ఇండియా మూవీకి ఇటీవ‌లే గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం.. లాంఛ‌నంగా పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేయ‌డం తెలిసిందే. డీవీవీ దాన‌య్య అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌నున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కానుంది.

ఇదిలా వుంటే హ‌రీష్ శంక‌ర్ తో 'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌' అంటూ త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ 'థేరీ'రీమేక్ ని కూడా ఇటీవ‌లే ప‌వ‌న్ లాంఛ‌నంగా మొద‌లు పెట్ట‌డం తెలిసిందే. ఇప్పుడు మ‌రో రీమేక్ ని కూడా ప‌ట్టాలెక్కించ‌బోతున్నారు. గ‌త కొంత కాలంగా త‌మిళ హిట్ ఫిల్మ్ 'వినోదాయ సితం'ని ప‌వ‌న్ తెలుగులో చేయ‌బోతున్నారంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందులో సాయి ధ‌ర‌మ్ తేజ్ కూడా ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు.

పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై అత్యత త‌క్కువ రోజుల్లో ఈ మూవీని రికార్డు స్థాయిలో పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. న‌టుడు స‌ముద్రఖ‌ని న‌టించి రూపొందించిన మూవీ కావ‌డంతో రీమేక్ కు కూడా ద‌ర్శ‌కుడిగా ఆయ‌న‌నే ఎంచుకున్నారు. తెలుగు నేటివిటీకి సంబంధించిన మార్పులని త్రివిక్ర‌మ్ పూర్తి చేసి డైలాగ్స్ బాధ్య‌త‌ల్ని సాయి మాధ‌వ్ బుర్రాకు అప్ప‌గించాడు. అయితే త‌ను ఈ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పుకున్న‌ట్టుగా తెలుస్తోంది.

కార‌ణం ఇప్ప‌టికే క‌మిట్ అయిన సినిమాలు వుండ‌టంతో సాయి మాధ‌వ్ బుర్రా ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నాడ‌ట‌. అయితే ఆ బాధ్య‌త‌ల్ని ప‌వ‌న్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ కే అప్ప‌గించిన‌ట్టుగా తెలుస్తోంది. ఈ నిర్ణ‌యం ఇప్పుడు మ‌హేష్ అభిమానుల్ని కంగారు పెట్టిస్తోంద‌ట‌.

ప్ర‌స్తుతం మ‌హేష్ తో త్రివిక్ర‌మ్ మూవీ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ స‌మ‌యంలో త‌న దృష్టిని 'వినోదాయ సితం' రీమేక్ మ‌ర‌ల్చే అవ‌కాశం వుంద‌ని మ‌హేష్ ఫ్యాన్స్ ఫీల‌వుతున్నార‌ట‌. ఇదిలా వుంటే ఇటీవ‌లే డైలాగ్ వెర్ష‌న్ ని త్రివిక్ర‌మ్ మొద‌లు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ప‌వ‌న్ కేవ‌లం 20 రోజులు మాత్రమే ఈ మూవీకి కేటాయించిన‌ట్టుగా ఇన్ సైడ్ టాక్‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.