Begin typing your search above and press return to search.

#EMK : మహేష్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్ మళ్లీ మారింది!

By:  Tupaki Desk   |   19 Oct 2021 2:00 PM IST
#EMK : మహేష్‌ ఎపిసోడ్‌ టెలికాస్ట్ మళ్లీ మారింది!
X
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ హోస్ట్‌ గా జెమిని టీవీలో టెలికాస్ట్‌ అవుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో ముగింపు దశకు వచ్చిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ షో కు సంబంధించిన షూటింగ్ ను ముగించాడనే వార్తలు వస్తున్నాయి. నాలుగు షెడ్యూల్స్ లో ఈ షో షూటింగ్‌ ను ముగించిన ఎన్టీఆర్ ఇప్పటికే మహేష్‌ తో ఆట ఆడించాడు. ఆ ఎపిసోడ్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేవి శ్రీ మరియు థమన్ ల తో కూడా ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు. అవి ఎప్పుడు వస్తాయి అనేది తెలియదు. వచ్చే నెలలో ముగించడం కోసం అప్పటి వరకు ఎపిసోడ్స్ ను చిత్రీకరించారు. ఎన్టీఆర్ మళ్లీ ఎవరు మీలో కోటీశ్వరులు సెట్‌ లో అడుగు పెట్టక పోవచ్చు అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలోనే మహేష్‌ బాబుతో షూట్‌ చేసిన ఎపిసోడ్‌ ను ఎప్పటికి టెలికాస్ట్‌ చేస్తారు అనే విషయమై చర్చ జరుగుతోంది.

దసరాకు రెండు మూడు వారాల ముందుగానే మహేష్ బాబుతో ఎవరు మీలో కోటీశ్వరులు ఎపిసోడ్‌ ను చిత్రీకరించడం జరిగింది. ఆ సమయంలోనే ఒక పిక్ లీక్ అయ్యి అందరి అంచనాలు పెంచేసింది. దసరా సందర్బంగా ఆ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ అవ్వబోతుంది అంటూ అంతా ఆశించారు. కాని సమంత గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్‌ ను టెలికాస్ట్‌ చేయడం జరిగింది. మహేష్ ఎపిసోడ్‌ ను దీపావళికి అనుకున్నారు. కాని తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు షో సీజన్ 1 చివరి ఎపిసోడ్‌ స్పెషల్‌ గెస్ట్ గా మహేష్‌ బాబు ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశ్యంతో షో నిర్వాహకులు మళ్లీ నిర్ణయం మార్చుకున్నారు అంటూ టాక్ వినిపిస్తుంది.

మహేష్ బాబు ఎపిసోడ్ ను షో చివరి ఎపిసోడ్ గా టెలికాస్ట్‌ చేయడం వల్ల మంచి ఆరంభంతో పాటు మంచి క్లోజింగ్ కూడా ఎన్టీఆర్‌ షో కు దక్కినట్లు అవుతుంది. అందుకే ఇలా ప్లాన్ చేశారని అంటున్నారు. రామ్‌ చరణ్‌ గెస్ట్ గా మొదటి ఎపిసోడ్‌ వచ్చింది. ఆ ఎపిసోడ్‌ కు వచ్చిన రేటింగ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రికార్డు బ్రేకింగ్‌ అన్నట్లుగా రేటింగ్ దక్కింది. అందుకే చివరి ఎపిసోడ్ కు కూడా అదే స్థాయి రేటింగ్ కోసం అంటూ మహేష్‌ బాబు ఎపిసోడ్ ను టెలికాస్ట్‌ చేయాలని భావిస్తున్నారు. ఆ ఎపిసోడ్‌ తర్వాత ఎన్టీఆర్‌ మళ్లీ బుల్లి తెరపై కనిపిస్తాడా లేదా అనేది అనుమానమే అనేది కొంత మంది టాక్‌. మొత్తానికి ఎవరు మీలో కోటీశ్వరులు షో ను గ్రాండ్ గా ముగించేందుకు గా మహేష్‌ ఎపిసోడ్ టెలికాస్ట్‌ ను మళ్లీ మార్చబోతున్నారు అనేది బుల్లి తెర వర్గాల టాక్. అసలు విషయం ఏంటీ అనేది షో నిర్వాహకుల నుండి ప్రకటన వస్తే కాని క్లారిటీ రాదు.