Begin typing your search above and press return to search.

మ‌హేష్ డైరెక్ట‌ర్ జ‌న‌వ‌రిలో మొద‌లుపెట్టేస్తున్నాడు!

By:  Tupaki Desk   |   13 Dec 2020 3:36 AM GMT
మ‌హేష్ డైరెక్ట‌ర్ జ‌న‌వ‌రిలో మొద‌లుపెట్టేస్తున్నాడు!
X
సూప‌ర్‌ స్టార్ మ‌హేష్‌ తో వంశీ పైడిప‌ల్లి `మ‌హ‌ర్షి`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ ని అందించిన విష‌యం తెలిసిందే. భారీ స్పాన్ వున్న క‌థ కావ‌డంతో భారీ హంగుల‌తో మంచి సందేశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కించి ప్ర‌శంస‌లు అందుకున్నాడు. మంచి టైమ్ ‌లో త‌న‌కు హిట్ చిత్రాన్ని అందించిన వంశీ పైడిప‌ల్లితో వెంట‌నే మ‌హేష్‌ మ‌రో సినిమా చేయాల‌నుకున్నారు. కానీ వంశీ చెప్పిన లైన్ మ‌హేష్ ‌ని ఇంప్రెస్ చేయ‌లేక‌పోయింది.

దీంతో అత‌న్ని ప‌క్క‌న పెట్టి మ‌హేష్ ప్ర‌స్తుతం ప‌ర‌శురామ్ ‌తో `స‌ర్కారు వారి పాట‌`కు గ్రీన్‌ సిగ్న‌ల్ ఇచ్చారు. అయితే వంశీ పైడి ప‌ల్లి మ‌హేష్ కోసం మ‌రో క‌థ‌ని సిద్ధం చేస్తున్నార‌ట‌. ఈ మూవీకి `స్టేట్‌ రౌడి` అనే పేరుని కూడా అనుకున్నార‌ట‌. అయితే దీనికి ముందు ఓ వెబ్ డ్రామాని తీసిన త‌రువాతే మ‌హేష్ ‌తో సినిమా వుంటుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి `ఆహా` కోసం భారీ స్థాయిలో ఓ వెబ్ సిరీస్‌ని చేయ‌బోతున్నారు.

దీనికి భారీ స్థాయిలో ఖ‌ర్చు చేయ‌బోతున్నార‌ట‌. ఈ వెబ్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కానున్న‌ట్టు తెలిసింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌నుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ వెబ్ డ్రామాలో న‌టించే న‌టీన‌టులు ఎవ‌రు? టెక్నీష‌యిన్స్ ఏంటీ అన్న‌ది మాత్రం త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానుంది.