Begin typing your search above and press return to search.
అయ్యో... ఇన్నాళ్లు మహేష్ కు అది లేదా?
By: Tupaki Desk | 8 Feb 2023 11:00 AM GMTఇండియన్ అంటే ఆధార్ తప్పని.. దేశంలో ప్రతి ఒక్కరికి ఆధార్ ను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయడం జరిగింది. స్టార్స్ కు సెలబ్రెటీలకు మరియు నాయకులకు అందరికి కూడా ఇప్పటికే ఆధార్ కార్డులు ఉన్నాయి. అయితే మహేష్ బాబు మాత్రం ఇన్నాళ్లు ఆధార్ కార్డ్ ను తీసుకోలేదు అనే టాక్ వినిపిస్తుంది.
ఇప్పుడు ఈ టాక్ రావడానికి కారణం తాజాగా హైటెక్ సిటీ సమీపంలోని దుర్గం చెరువులోని ఆధార్ వెరిఫికేషన్ ఆఫీస్ కు మహేష్ బాబు వెళ్లాడు. అక్కడ మహేష్ బాబు ఆధార్ కోసం వేలి ముద్ర వేయడంతో పాటు ఐరిష్ వెరిఫికేషన్ చేయడం జరిగింది.
ఆధార్ సెంటర్ లో మహేష్ బాబు సందడి చేయడంతో సోషల్ మీడియాలో ఇన్నాళ్లు మహేష్ బాబుకు ఆధార్ కార్డు లేదా అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటూ ఉన్న మహేష్ బాబు పాన్ కార్డు.. బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా మెయింటెన్ చేయాల్సి ఉంటుంది.
ఆ రెండు కూడా తప్పనిసరిగా ఆధార్ తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది. కనుక మహేష్ బాబు గతంలోనే ఆధార్ కార్డును కలిగి ఉంటాడు. అయితే ఏదైనా చిన్న చిన్న మార్పుల నిమిత్తం ఆధార్ సెంటర్ ను మహేష్ బాబు సందర్శించి ఉంటాడు అనేది కొందరి అభిప్రాయం. అసలు విషయం ఏంటి అనేది తెలియాల్సి ఉంది.
ఇక మహేష్ బాబు యొక్క సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.