Begin typing your search above and press return to search.

మహేష్‌ ఛార్మింగ్ లుక్‌ సీక్రెట్‌ రివీల్‌ చేసిన రామ్‌ లక్ష్మణ్‌

By:  Tupaki Desk   |   5 May 2022 9:30 AM GMT
మహేష్‌ ఛార్మింగ్ లుక్‌ సీక్రెట్‌ రివీల్‌ చేసిన రామ్‌ లక్ష్మణ్‌
X
సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు అందంను చూసి ఆరాధించే వారు అసూయ పడే వారు ఉంటారు. అయిదు పదుల వయసుకు దగ్గర పడుతున్నా కూడా ఇంకా మూడు పదుల వయసు కుర్రాడిగా మహేష్ బాబు ఎలా ఉంటున్నాడో అంటూ ప్రతి ఒక్కరు కూడా బుర్ర బద్దలు కొట్టుకుని మరీ ఆలోచిస్తూ ఉంటారు. ఆయన హీరోగా చేస్తున్న సినిమాల్లో లుక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడేమో అలా కనిపిస్తాడు అనుకునే వారు ఉన్నారు. కాని ఆయన నాచురల్‌ లుక్ కూడా అంతే ఉంటుంది.

బయట సాదారణ వేడుకల్లో లేదా కార్యక్రమాల్లో పాల్గొన్న సమయంలో ఆయన లుక్‌ చూసి కూడా వావ్‌ అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా అసూయ పడేంత ఛార్మింగ్ ఫేస్ ను కలిగి ఉన్న మహేష్‌ బాబు రహస్యం ఏంటీ అనేది మాత్రం ఇన్నాళ్లు తెలియదు. కాని తాజాగా రామ్ లక్ష్మణ్‌ స్టంట్స్ మాస్టర్స్ ఆ విషయాన్ని రివీల్‌ చేసి అందరిని ఆశ్చర్య పర్చారు.

మహేష్‌ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలకు కొరియోగ్రఫీ అందించిన రామ్‌ లక్ష్మణ్‌ మాస్టర్స్ మీడియా ముందుకు వచ్చి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్బంగా వారు మహేష్ బాబుతో తమకు ఉన్న అనుబంధం మరియు సుదీర్ఘ కాలంగా కొనసాగుతు వస్తున్న సంబంధం గురించి చెప్పుకొచ్చారు.

మహేష్‌ బాబు ఖచ్చితంగా ప్రతి రోజు ధ్యానం చేస్తారు. మూన్ ధ్యానం చేయడం వల్ల ఆయన చాలా ప్రశాంతంగా కనిపిస్తారు. ధ్యానం సమయంలో ఆయన పూర్తిగా ట్రాన్స్ లోకి వెళ్లి పోతారు. ఆ సమయంలో ఆయన శరీరం మరియు మనసు పూర్తిగా ఆయన ఆదీనంలోకి వస్తాయని తద్వారా ఆయన నిత్య యవ్వనుడిగా ఉంటున్నారని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆయన ఈ మూన్‌ ధ్యానం ను సుదీర్ఘ కాలంగా చేస్తున్నారని అన్నారు.

మహేష్ బాబు కేవలం ధ్యానం మాత్రమే కాకుండా యోగా ఇంకా పలు రకాల వర్కౌట్‌ లు కూడా చేస్తూ తన ఫిజిక్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ లో డైలాగ్‌ మాదిరిగా ఆయన తన ఫిజిక్ ను మరియు లుక్ ను కాపాడుకునేందుకు చాలా కష్టపడుతున్నాడు. అందుకు ఆయన దూల తీరుతూ ఉంటుందని ఫన్నీ గా కామెంట్స్ వస్తున్నాయి.