Begin typing your search above and press return to search.

హారర్ సినిమా కోసం చెత్త ప్రమోషన్!!

By:  Tupaki Desk   |   15 Sep 2016 11:30 AM GMT
హారర్ సినిమా కోసం చెత్త ప్రమోషన్!!
X
కట్ చేస్తే.. అది కృతి కర్భందా తొలిసారి బాలీవుడ్ లో నటిస్తున్న 'రాజ్ రీబూట్' సినిమా. ఈ సినిమా తాలూకు డౌన్ లోడ్ లింక్స్ ఆన్ లైన్లో వచ్చేశాయంటూ దర్శకుడు విక్రమ్ భట్ గాబరాపడిపోవడం.. ఇక యునిట్ అంతా సినిమాను దయచేసి ధియేటర్లలోనే చూడండి అంటూ హడావుడి చేయడం.. ఇవన్నీ అందరిని కాస్త బాధించాయి. ఎందుకంటే పైరసీ బాటన పడితే సినిమా ఫేట్ ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. కాని అసలు ఈ పైరసీ యాంగిల్లో పెద్ద ఎక్సట్రాలే ఉన్నాయి తెలుసా.

అసలు ఈ సినిమాలో చివరాకర్లో వచ్చే ఒక క్లిప్పును రిలీజ్ చేసేసి.. పైరసీ అయిపోయింది అంటూ ఎవరో సినిమా యునిట్ మీద ''ప్రాంక్‌'' ప్లే చేశారట. ఈ విషయంగా స్వయంగా దర్శకుడు విక్రమ్ భట్ అండ్ టీమ్ రివీల్ చేసింది. ప్రొడ్యూసర్లలో ఒక్కడైన మహేష్‌ భట్ కూడా ఈ విషయం చెప్పాడు. ఏవండీ మాకు తెలియక అడుగుతున్నాం.. అసలు సినిమాలో ఒక ఒకే క్లిప్పును రిలీజ్ చేస్తారా పైరసీ చేసేవారు? అంటే యునిట్ మెంబర్లే ఇలా ఒక చిన్న క్లిప్ రిలీజ్ చేసి పైరసీ అంటూ హడావుడి చేసి సినిమాకు కొత్త రకం ప్రమోషన్ చేశారనమాట.

వీళ్లందరికీ ఒకసారి 'నాన్న పులి' కథను చెప్పాలండోయ్. ఇలాంటి ప్రాంక్స్ అండ్ ఫీట్స్ చేస్తూ ఉండండి.. ఈసారి నిజంగా పైరసీ అయినా కూడా జనాలు నమ్మకుండాపోతారు. మరీ ఇలాంటి చెత్త ప్రమోషన్లు ఎందుకు బాసూ?