Begin typing your search above and press return to search.

చిరంజీవికి రుణ‌ప‌డి ఉంటా -మ‌హేష్‌

By:  Tupaki Desk   |   29 Oct 2015 3:59 AM GMT
చిరంజీవికి రుణ‌ప‌డి ఉంటా -మ‌హేష్‌
X
థియేట‌ర్ ఆర్ట్స్‌ ని - సినిమాని విడ‌దీసి చూడ‌లేం. థియేట‌ర్ లో పెర్ఫామ్ చేసిన‌వారంతా సినిమాల వైపు వ‌చ్చి స‌క్సెస్ సాధిస్తున్నారు. ప్ర‌కాష్‌రాజ్‌ - ష‌బానా ఆజ్మి - నందితాదాస్‌ - జంధ్యాల‌ - రాధిక ఆప్టే .. ఒక‌రేమిటి.. ఎంద‌రో థియేట‌ర్ బ్యాక్‌ గ్రౌండ్ నుంచి వ‌చ్చి న‌టీన‌టులుగా స్థిర‌ప‌డ్డారు. మ‌న తెలుగు రాష్ర్టాల్లో థియేట‌ర్ ఆర్ట్స్‌ కి అంత‌గా పేరు రాలేదు కానీ, ముంబై లాంటి మెట్రో సిటీల్లో థియేట‌ర్ కి - స్టేజీ డ్రామాల‌కు బోలెడంత గుర్తింపు ఉంది. స్టేజీ పెర్ఫామెన్స్ కోసం చెవి కోసుకునేవాళ్లెంద‌రో.

అంతెందుకు మెగాస్టార్ చిరంజీవి సైతం ఆరంభం స్టేజీ డ్రామాని విప‌రీతంగా ప్రేమించి న‌టించేవారు. అట్నుంచే సినిమాల్లోకొచ్చారు. అందుకేనేమో బాలీవుడ్ దిగ్గ‌జం మ‌హేష్‌ భ‌ట్ ఇటీవ‌లే హైద‌రాబాద్ విచ్చేసిన‌ప్పుడు థియేట‌ర్ -డ్రామా గురించిన ఎన్నో సంగ‌తుల్ని ముచ్చ‌టిస్తూ .. స‌మాజం నుంచి థియేట‌ర్ - పెర్ఫామింగ్ ఆర్ట్స్ ప్ర‌భావితం చెందేవి.. అని అన్నారు. అంతేకాదు ఓ అరుదైన విష‌యాన్ని కూడా ఈ సంద‌ర్భంగా ప్ర‌స్థావించారు. ఆరోజుల్లో నేను జెంటిల్‌మ‌న్ (చిరంజీవి) - జ‌క‌మ్(నాగార్జున‌) వంటి సినిమాలు నిర్మించాను. మెగాస్టార్ చిరంజీవి హీరోగా జెంటిల్‌ మ‌న్ సినిమా తీసిన‌ప్పుడు నా ద‌గ్గ‌ర డ‌బ్బులేమీ లేవు. అయినా చిరంజీవి అంగీక‌రించారు. అత‌డికి ఎప్ప‌టికీ రుణ‌ప‌డి ఉంటాను.. అంటూ గ‌తాన్ని గుర్తు చేసుకోవ‌డం విశేషం.

ఈరోజు కోటానుకోట్ల సామ్రాజ్యాన్ని విస్త‌రించి ఉండొచ్చు కానీ.. చిరుతో జెంటిల్‌ మేన్ సినిమాని రీమేక్ చేసిన‌ప్పుడు మ‌హేష్‌ భ‌ట్ పూర్తిగా అప్పుల్లో ఉన్నార‌న్న టాక్ వ‌చ్చింది. ఆ సంగ‌తినే ఇప్పుడు స్మ‌రించుకుని చిరుకి కృత‌జ్ఞ‌త తెలుపుకున్నార‌న్న‌మాట‌!