Begin typing your search above and press return to search.

పొల్లాచీలో `మ‌మ‌ర్షి` దూకుడు

By:  Tupaki Desk   |   6 Jan 2019 2:58 PM GMT
పొల్లాచీలో `మ‌మ‌ర్షి` దూకుడు
X
ఈ దూకుడు.. సాటెవ్వ‌రూ? ఓవైపు షూటింగుల దూకుడు, మ‌రోవైపు ప‌ర్స‌న‌ల్ లైఫ్ సెల‌బ్రేష‌న్స్‌ దూకుడు .. రెండిటిని పెర్ఫెక్ట్ గా బ్లెండ్ చేసి, ప‌క్కా ప్రొఫెష‌న‌ల్ జెంటిల్ మేన్ అనిపించుకుంటున్నాడు మ‌హేష్. బిజినెస్ మేన్‌ లా ఉండాల్సి వ‌చ్చిన‌ప్పుడు బిజినెస్ లో దిగిపోతూనే, ప‌ర్స‌న‌ల్ లైఫ్ విష‌యంలో మాత్రం అస్స‌లు రాజీకి రావ‌డం లేదు. ఇటీవ‌లే క్రిస్మ‌స్, కొత్త సంవ‌త్స‌రం వేడుక‌ల్ని ఫుల్ గా విదేశాల్లో ఎంజాయ్ చేశాడు. 31 మిడ్ నైట్ సెల‌బ్రేష‌న్స్ కోసం దుబాయ్ విజిట్ చేశాడు ఫ్యామిలీతో. సెల‌బ్రేష‌న్స్ పూర్త‌యి తిరిగి హైద‌రాబాద్ చేరుకున్న మ‌హేష్ త‌దుప‌రి మ‌హ‌ర్షి షెడ్యూల్ కోసం ప్రిప‌రేష‌న్స్ లో ఉన్నాడ‌ట‌.

ఇప్ప‌టివ‌ర‌కూ హైద‌రాబాద్ లోని సెట్స్ లో మ‌హ‌ర్షి చిత్రీక‌ర‌ణ పూర్తి చేశారు. ప్ర‌ధాన‌మైన షెడ్యూల్స్ పూర్త‌య్యాయి. తదుప‌రి షెడ్యూల్ ని పొల్లాచీలో ప్లాన్ చేస్తున్నార‌ట‌. రెండు వారాల పాటు సుదీర్ఘంగా సాగే ఈ షెడ్యూల్ పూర్త‌యితే మెజారిటీ టాకీ పూర్త‌యిన‌ట్టే. ఈ షెడ్యూల్ లో ప్ర‌ధాన తారాగ‌ణం అంతా పాల్గొంటున్నార‌ట‌. పెండింగ్ ప‌నుల గురించి ఈలోగానే ఆలోచిస్తారు.

మ‌హేష్ ఈ చిత్రంలో రెండు షేడ్స్ ఉన్న పాత్ర‌ల్లో న‌టిస్తున్నాడు. ఒక షేడ్ అమెరికాలో కార్పొరెట్ లుక్, వేరొక షేడ్ లో కాలేజ్ గ‌య్ లా క‌నిపిస్తాడ‌ని ఇదివ‌ర‌కూ రిలీజైన ఫోటోలు చెప్పాయి. రైతు కోణం ఉంద‌ని చెప్పుకున్నారు. అల్ల‌రి న‌రేష్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. ఇక ఈ సినిమా క‌థ‌లో ఫ్రెండ్షిప్ అన్న‌ది కీల‌క‌మైన ఎలిమెంట్ అని చెబుతున్నారు. ముంబై బొమ్మ‌ పూజా హెగ్డే ఈ చిత్రంలో మ‌హేష్ తో ఆడిపాడుతోంది. దిల్ రాజు- అశ్వ‌నిద‌త్- పీవీపీ బృందం నిర్మిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో సినిమాని రిలీజ్ చేయ‌నున్నారు.