Begin typing your search above and press return to search.
యూట్యూబ్ కి మహేష్ ఇంటర్వ్యూ
By: Tupaki Desk | 10 Dec 2019 1:30 AM GMTఫేస్ బుక్- ట్విటర్- ఇన్ స్టా- యూ ట్యూబ్ ఛానల్స్ వంటి సోషల్ మీడియా మాధ్యమాలు అందుబాటులోకి రావడంతో సినిమా ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. చిన్న హీరోల నుంచి అగ్ర హీరోల వరకూ అంతా సోషల్ మీడియాను ఓ రేంజ్ లో ప్రచారానికి ఉపయోగించుకుంటున్నారు. కోట్లాది రూపాయల విలువ చేసే పబ్లిసిటీని ఫ్రీగా కొట్టేస్తున్నారు. ఏ సినిమాకు సంబంధించిన ప్రచారమైనా క్షణాల్లో సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరిపోతోంది. ట్రైలర్లు- టీజర్లు- మోషన్ పోస్టర్స్- లిరికల్ వీడియోలు క్షణాల్లో వైరల్ అయిపోతూ కావాల్సినంత బజ్ క్రియేట్ చేస్తున్నాయి.
అయితే యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వూలు ఇవ్వడం ఇప్పటివరకూ బాలీవుడ్ హీరోలకే చెల్లింది. ఇప్పుడిప్పుడే టాలీవుడ్ హీరోలు కూడా ఆ పంథాలో వెళ్లడం మొదలు పెడుతున్నారు. ఆ మధ్య రామ్ చరణ్ ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వూ ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందు అక్కినేని కోడలు సమంత `మై విలేజ్ షో` గంగవ్వకు ఇంటర్వూ ఇచ్చింది. అప్పట్లో ఇది జోరుగా ట్రెండింగ్ లో నిలిచింది. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సరిలేరు నీకెవ్వరు ప్రచారం కోసం యూట్యూబ్ బాటలో పయనిస్తున్నారని తెలుస్తోంది.
`మై విలేజ్ షో` యూట్యూబ్ ఛానల్ గంగవ్వతో చిట్ చాట్ లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూ ప్రసారమైతే సదరు యూట్యూబ్ ఛానల్ పంట పండినట్లే. ఒకప్పుడు మహేష్ ప్రచారానికి దూరంగా ఉండే వాడు. కనీసం ఆడియో వేడుకలకు కూడా వచ్చేవాడు కాదు. తర్వాత కాలంలో ఆ యాటిట్యూడ్ ని మార్చుకుని నిర్మాతలకు సహకరిస్తున్నాడు. ఇప్పుడు పత్రికలు- ఛానెల్స్- వెబ్ మీడియా అంటే చుట్టేస్తున్నాడు. ఈ నేపథ్యంలో యూట్యూబ్ ప్రచారానికి మహేష్ ఓకే చెప్పడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.