Begin typing your search above and press return to search.

మహేష్‌ ఫోన్ చేసి విషెస్ చెప్పాడట

By:  Tupaki Desk   |   5 Sep 2016 4:32 AM GMT
మహేష్‌ ఫోన్ చేసి విషెస్ చెప్పాడట
X
ఇప్పుడు అందరూ మహేష్‌ బాబు ఏమంటాడా అనే ఎదురు చూస్తున్నారు. ఒక ప్రక్కన్న విమర్శకులు సినిమా తమకు అంతగా నచ్చలేదని చెప్పినా కూడా.. హాలీడే ఎఫెక్ట్ కానివ్వండి లేదంటే సరైనోడు తరహా ఫినామెనన్ కానివ్వండి.. జనతా గ్యారేజ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలక్షన్లను బాగానే రాబడుతోంది. ముఖ్యంగా మూడు రోజుల్లో సినిమా ప్రపంచవ్యాప్తంగా 43 కోట్ల షేర్ రావడంతో.. మొత్తంగా రికవర్ అవ్వాల్సిన 67 కోట్లు కాస్త ఈజీయేమో అనిపిస్తోంది.

ఈ మాటలు అలా ఉంచితే.. ఇప్పుడు కొరటాల శివతో ఆల్రెడీ శ్రీమంతుడు సినిమా చేసి సెన్సేషనల్ హిట్ కొట్టిన మహేష్‌ బాబు.. జనతా గ్యారేజ్ సినిమాను కూడా చూశాడట. కొరటాల ఇప్పుడు మహేష్‌ కు మంచి మిత్రుడే కాదు.. తదుపరి ఏ.ఆర్.మురుగుదాస్ సినిమా పూర్తవ్వగానే ఈ దర్శకుడితో మహేష్‌ రెండోసారి పనిచేస్తున్నాడు. ఇద్దరి మధ్యనా ఆ క్లోజ్నెస్ ఉండటం చేత.. వెంటనే కాల్ చేసిన కొరటాలను అభినందించాడట మహేష్‌. ఫోన్లోనే ప్రశంసలతో ముంచెత్తి.. ఇప్పుడు తొలి 3 సినిమాలతోనే హ్యాట్రిక్ కొట్టినందుకు కొరటాలకు విషెస్ కూడా తెలిపాడట.

ఏదేమైనా కూడా ఒక స్టార్ హీరో సినిమాను చూసి.. వెంటనే ఇలా ఎప్రిషియేట్ చేయడం అనేది చెప్పుకోదగిన అంశమే. ఆ విషయంలో మహేష్‌ బాబును మెచ్చుకోవాల్సిందే. ఈ ఊపులో ఇక మహేష్‌ అండ్ కొరటాల సినిమాల ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోండి.