Begin typing your search above and press return to search.

నేనెప్పుడూ అభిమానించే హీరో బాలయ్య: స్టార్ హీరో ట్వీట్

By:  Tupaki Desk   |   10 Jun 2020 5:30 PM GMT
నేనెప్పుడూ అభిమానించే హీరో బాలయ్య: స్టార్ హీరో ట్వీట్
X
టాలీవుడ్ నటసింహం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా సందర్భంగా ఇండస్ట్రీలోని ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తన పుట్టినరోజుకి ఒక రోజు ముందుగానే బాలయ్య తన అభిమానులకు అదిరిపోయే గిప్ట్ ఇచ్చాడు. తన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ కోసం జగదేకవీరుని కథలోని అమర గాయకుడు ఘంటసాల గారు ఆలపించిన ‘శివ శంకరీ శివానంద లహరి’ పాటను పాడి అభిమానులకు థ్రిల్ ఇచ్చాడు బాలయ్య. అంతేకాకుండా తాజాగా బోయపాటి శ్రీనుతో చేస్తున్న మూడో సినిమాకి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేసి ఫుల్ ఎనర్జీ ఇచ్చాడు. ఈ సందర్భంగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సైతం ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపాడు. "బాలయ్య ఎనర్జీని పవర్ హౌస్ అంటూ కొనియాడాడు. నేను ఎల్లప్పుడూ అభిమానించే నటుడు బాలయ్య అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. 60వ పుట్టి రోజు సందర్భంగా మీకు శుభాకాంక్షలు.. ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను" అని మహేష్ తన ట్వీట్‌లో తెలిపాడు.

ఇక బాలయ్య - బోయపాటి కాంబినేషన్లో విడుదలైన ప్రోమోలో "ఎదుటివారితో మాట్లాడేటపుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో.." అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్‌తో దుమ్మురేపాడు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బాలయ్య ట్రెండ్ నడుస్తుంది. ప్రస్తుతం ట్విట్టర్‌లో కూడా బాలయ్యే నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉన్నారు. ఇక బాలయ్య ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారని చెప్పాలి. ఎందుకంటే అద్భుతమైన టీజర్ కి.. అద్భుతమైన స్పందన లభిస్తుంది. బాలయ్య కూడా ఈ విషయంలో సంతోషం వ్యక్తం చేసాడు. ఇంకా బాలయ్యను టాలీవుడ్ స్టార్లు మెగాస్టార్ చిరంజీవి.. ఎన్టీఆర్.. ఇలా అందరూ విష్ చేస్తున్నారు. ఇక మహేష్ నుండి ట్వీట్ రాగానే సోషల్ మీడియాలో మాములు హవా లేదు. బాలయ్య గురించి మహేష్ అరుదుగా మాట్లాడతాడు. అయితే ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో తన 27వ సినిమా సర్కారు వారి పాట చేస్తున్నాడు.