Begin typing your search above and press return to search.

సూపర్ స్టార్‌ మీరు సూపర్‌

By:  Tupaki Desk   |   8 July 2021 1:30 PM GMT
సూపర్ స్టార్‌ మీరు సూపర్‌
X
సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఒకప్పుడు సోషల్‌ మీడియాలో అస్సలు యాక్టివ్ గా ఉండేవారు కాదు. కాని ఈమద్య కాలంలో తన తోటి నటీ నటులకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతో పాటు సందర్బానుసారంగా సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉన్నాడు. పెద్ద ఎత్తున ప్రజా సమస్యల గురించి ఆయన స్పందిస్తున్న తీరు ఈమద్య కాలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. మహేష్ బాబు ఎంత మంచి వ్యక్తి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. సాయం అవసరం అయిన వారికి వెంటనే సాయం చేయడంతో పాటు తన చుట్టు ఉన్న వారిని ఎప్పుడు సంతోషంగా చూసుకుంటూ ఉంటాడని కూడా టాక్ ఉంది.

తాజాగా మహేష్‌ బాబు ఈ ఫొటో ను ట్వీట్‌ చేశాడు. మహేష్ బాబుకు సుదీర్ఘ కాలంగా మేకప్‌ మెన్‌ గా చేస్తున్న ఈయన పేరు పట్టాభి. ఆయన పుట్టిన రోజు నేడు. ఈసందర్బంగా ఆయన కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్‌ బాబు చేసిన ట్వీట్‌ వైరల్ అయ్యింది. సాదారణంగా అయితే సెలబ్రెటీలు వారి మేకప్ ఆర్టిస్టులను గురించి కనీసం మాట్లాడేందుకు కూడా ఇష్టపడరు. కొందరు వారిని వ్యక్తిగత సహాయకులు గా కూడా చూస్తూ ఉంటారు. కాని పట్టాభిని మాత్రం మహేష్‌ తన ఇంట్లో వ్యక్తిగా చూస్తారట.

అందుకే నేడు ఆయన పుట్టిన రోజు సందర్బంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ఇప్పటి వరకు మీలాంటి బెస్ట్ మేకప్‌ మన్‌ ను చూడలేదు.. ఐ లవ్‌ యూ మరియు మీరు అంటే ఎప్పటికి గౌరవమే అంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ట్వీట్‌ మహేష్ బాబు తీరును చెప్పకనే చెబుతుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా షూటింగ్‌ లో ఉన్న మహేష్‌ బాబు తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న విషయం తెల్సిందే. ఇక మహేష్‌ బాబు ఇప్పుడు నటిస్తున్న సినిమాలకు కూడా మేకప్‌ మన్ గా పట్టాభి వ్యవహరిస్తున్నాడు అనే విషయం తెల్సిందే. మహేష్‌ బాబు కు మాత్రమే కాకుండా ఆయన కుటుంబ సభ్యులకు కూడా పట్టాభి అంటే ప్రత్యేక అభిమానంగా చెబుతూ ఉంటారు.