Begin typing your search above and press return to search.

మ‌హేష్ బాబుని ఈ సారి దుబాయ్ లో లాక్ చేశారు

By:  Tupaki Desk   |   16 Dec 2021 5:02 PM IST
మ‌హేష్ బాబుని ఈ సారి దుబాయ్ లో లాక్ చేశారు
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ ప్ర‌తీ ఏడాది వెకేష‌న్ కి వెళుతుంటారు. సినిమా షూటింగ్ ల‌కు గ్యాప్ దొరికిందా ఫ్యామిలీతో క‌లిసి న‌చ్చిన ప్ర‌దేశంలో వాలిపోతుంటారు. `ప్ర‌తీ ఏడాది సినిమాల షూటింగ్ ల కంటే విహార యాత్ర‌ల‌కే అధిక ప్రాధాన్య‌త ఇస్తుంటారు క‌దా` అని ఇటీవ‌ల `మీలో ఎవ‌రు కోటీశ్వ‌రులు` షోలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ని అడ‌గ‌డం తెలిసిందే.

అంత‌గా ఫారిన టూర్ ల‌కు ప్రాధాన్య‌తనిచ్చే సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ ఏడాది న్యూఇయ‌ర్ వేడుక‌ల‌ని బూత‌ల స్వ‌ర్గంగా భావించే దుబాయ్ లో సెల‌బ్రేట్ చేసుకోబోతున్నారు. అంటే సూప‌ర్ స్టార్ ఈ న్యూ ఇయ‌ర్ కి అక్క‌డ లాక్ అయ్యార‌న్న‌మాట‌.

ప్ర‌స్తుతం ఒంట‌రిగా స్పెయిన్ లో వున్న మహేష్ బాబు అక్క‌డ త‌న ప‌ని పూర్త‌యిపోగానే అక్క‌డి నుంచి నేరుగా దుబాయ్ వ‌చ్చేస్తార‌ట‌. మ‌హేష్ దుబాయ్ చేరుకున్నాక ఆయ‌న భార్య న‌మ్ర‌త పిల్ల‌లు గౌత‌మ్‌, సితార‌తో క‌లిసి దుబాయ్ కి చేరుకుంటుంద‌ని తెలిసింది.

ప్ర‌తీ ఏడాది ఏదో ఒక దేశానికి ఫ్యామిలీతో క‌లిసి ప్ర‌త్యేకంగా వెకేష‌న్ కి వెళ్లే మ‌హేష్ ఈ ఏడాది వెకేష‌న్ కోసం దుబాయ్ ని ఎంచుకున్నార‌ట‌. స్పెయిన్ లో ఇటీవ‌లే మ‌హేష్ కు మోకాలి స‌ర్జ‌రీ జ‌రిగింది.

2017 లో ఏ.ఆర్‌. మురుగ‌దాస్ రూపొందించిన `స్పైడ‌ర్‌` చిత్రంలో మ‌హేష్ న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ లో మ‌హేష్ మోకాలికి గాయ‌మైంది.

అప్ప‌టి నుంచి అది బాధ‌పెడుతుండ‌టంతో రీసెంట్ గా దానికి సంబంధించిన స‌ర్జ‌రీని స్పెయిన్ లో చేయించుకున్నారు. కొన్ని రోజుల విశ్రాంతి అవ‌స‌ర‌మ‌నిడాక్ట‌ర్లు చెప్ప‌డంతో మ‌హేష్ విశ్రాంతి తీసుకోవ‌డానికి స్పెయిన్ నుంచి నేరుగా దుబాయ్ చేరుకుంటార‌ట‌.

అక్క‌డే ఫ్యామిలీతో క‌లిసి న్యూఇయ‌ర్ ని సెల‌బ్రేట్ చేసుకుంటార‌ని తెలిసింది. ఆ త‌రువాతే `స‌ర్కారు వారి పాట` చిత్రీక‌ర‌ణ లో పాల్గొంటార‌ట‌. జ‌న‌వ‌రి మొద‌టి వారంలో దుబాయ్ నుంచి మ‌హేష్ హైద‌రాబాద్ తిరిగి వ‌స్తార‌ని, ఆ త‌రువాతే ప‌ర‌శురామ్ తో చేస్తున్న `స‌ర్కారు వారి పాట‌` చిత్రీక‌ర‌ణ లో పాల్గొంటార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.