Begin typing your search above and press return to search.

న‌రేష్‌ కి మ‌హేష్‌ వార్నింగ్!

By:  Tupaki Desk   |   5 Sep 2018 8:33 AM GMT
న‌రేష్‌ కి మ‌హేష్‌ వార్నింగ్!
X
సూప‌ర్‌ స్టార్ మ‌హేష్ సినిమాలో అల్ల‌రి న‌రేష్ పాత్ర ఏంటి? గ‌త కొంత‌కాలంగా ఆస‌క్తిక‌ర డిబేట్ ఇది. న‌రేష్ పాత్ర ఈ సినిమాకి ఎంతో కీల‌కం. మ‌హేష్‌ కి స్నేహితుడిగా న‌టిస్తున్నాడు. శ్రీ‌కృష్ణుడి స్నేహితుడు కుచేలుడు త‌ర‌హా పాత్ర‌లో న‌రేష్ న‌టిస్తున్నాడంటూ ఊహాగానాలు సాగాయి. అస‌లు ఈ సినిమాలో న‌రేష్‌ పాత్ర ఇదీ అని అధికారికంగా మాత్రం రివీల్ కాలేదు.

ఇదే విష‌యం అల్ల‌రి న‌రేష్‌ నే ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు. నా కెరీర్‌ లో మ‌రో గాలి శీను పాత్ర‌లాంటిదే ఇది. ఇప్ప‌టికే మ‌హేష్‌ తో క‌లిసి 45 రోజుల షెడ్యూల్ ట్రావెల్ అయ్యాను. అక్టోబ‌ర్ నుంచి మ‌ళ్లీ చిత్రీక‌ర‌ణ‌కు వెళ‌తాను. ఇంకా `మ‌హ‌ర్షి` సినిమా కోసం 100 రోజుల ప్ర‌యాణం చేయాల్సి ఉంది.. అని తెలిపారు. మీ పాత్ర గురించి డీటెయిల్స్ ప్లీజ్! అని ప్ర‌శ్నించిన మీడియాతో ఇంతకుమించి చెప్పొద్ద‌ని వార్నింగ్ ఇచ్చారు! అంటూ స‌ర‌దాగా న‌వ్వేశారు న‌రేష్‌.

అస‌లె సెట్స్ లో మ‌హేష్ ఎలా ఉంటారు? అన్న ప్ర‌శ్న‌కు మ‌హేష్ ఎంతో జోవియ‌ల్‌. సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉన్న హీరో. త‌న‌తో క‌లిసి న‌టించ‌డాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నాన‌ని న‌రేష్ తెలిపారు. మ‌హేష్ ఎంతో స్నేహ‌శీలి అని తెలిపారు. ఇక తాను వైవిధ్య‌మైన పాత్ర‌లు చేసేందుకు ఇష్ట‌ప‌డ‌తాన‌ని న‌రేష్ ఓ ప్ర‌శ్న‌కు స‌మాధాన‌మిచ్చారు. గ‌మ్యంలో హీరోగా న‌టించ‌లేదు. ఆ పాత్ర‌లోని ఎమోష‌న్ హీరోని చేసింద‌ని అన్నారు. న‌రేష్ న‌టించిన `సిల్లీ ఫెలోస్‌` ఈ శుక్ర‌వారం రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.